సర్వే: ప్రయాణికుల ధాటికి వణికిపోతున్న ఎయిర్‌లైన్స్ సిబ్బంది

దేశంలోని ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ప్రయాణికుల చేతిలో వేధింపులకు గురవుతున్నారంటూ ఓ సర్వే సంచలన విషయాన్ని బయటపెట్టింది.

ప్రతి పదిమందిలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నట్లు గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ పరిశోధనలో తేలింది.

"""/"/  దేశంలోని ప్రధాన విమాశ్రయాల్లో వందకు పైగా ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులు తమ పట్ల మాటలు, చేష్టలు, దురుసుగా వ్యవహరిస్తున్నారు.

విమానాశ్రయ ఆస్తుల ధ్వంసం, ఏజెంట్లతో బలవంతంగా సెల్ఫీ/వీడియో, అనుమతి లేకుండా బ్యాడ్జిలను లాక్కోవడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఘటనలు అమెరికా ఎయిర్‌పోర్టుల్లో నిత్యకృత్యమయ్యాయని సర్వే నిగ్గు తేల్చింది.

"""/"/  ప్రధానంగా లాగేజ్ పోవడం, బ్యాగేజ్‌ ఫీజు, సర్వీస్ రద్దవ్వడం, మద్యం సేవించినందుకు అడ్డుకున్న సందర్భాల్లో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై ప్రయాణికులు దురుసుగా వ్యవహరిస్తున్నారు.

ఆయా సంఘటనలన్నీ కూడా చెక్ ఇన్ కౌంటర్లు, బోర్డింగ్ పాస్ కౌంటర్లు, లాగేజ్ పాయింట్ల వద్ద ఎక్కువగా జరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో సిబ్బంది విధులు నిర్వర్తించాలంటనే భయపడిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

మీ జుట్టు పొడుగ్గా దట్టంగా పెరగాలా.. అయితే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!