మెగాస్టార్ చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఆ పని చేశా.. మణిశర్మ కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు మణిశర్మ.

బాగా ఇప్పటివరకు తెలుగులో దాదాపుగా 150 కు పైగా సినిమాలలో పనిచేశారు మణిశర్మ.

ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ మణిశర్మ ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.

కాగా ఈ షో కి టాలీవుడ్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది హీరోలు, కమెడియన్లు డైరెక్టర్లు బుల్లితెర సెలబ్రిటీలు ఈ షో కి హాజరైన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న మణిశర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మీ నాన్నగారు ఏదైనా తప్పులు చేస్తే ఇంకా రెండు మూడు తప్పులు చేయి నాన్న అని అన్ని తప్పులకు కలిపి ఒకేసారి దెబ్బలు కొట్టేవారంట కదా అని అలీ అనగా తాను సంగీతం నేర్చుకునే సమయంలో తన తండ్రి తనకు పండితుడని, తాను ఒక పరమ శుంటని అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు మణిశర్మ.

ఆ తర్వాత చిరంజీవి గారికి ఇష్టం లేని పని ఏదో చేశారంట కదా అని అడగగా.

"""/"/ అవును చిరంజీవి గారికి ఇష్టం లేకపోయినా సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తప్పించి మరి ఉదిత్ నారాయణతో రామ్మా చిలకమ్మా అనే పాటను పాడించాను.

ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనసులో ఏది అనుకుంటే అది చేసేవాడని అది నెరవేరేవరకు దానిని విడిచి పెట్టే వాన్ని కాదు అని చెప్పుకొచ్చారు మణిశర్మ.

మీరు తెలుగులో నూరు,150 కి పైగా సినిమాలలో చేశారు కదా అని అడగగా మీతో కలిసి ఒక పాట చేశాను అని అనడంతో వెంటనే అలీ నమ్మొద్దు నమ్మొద్దు అనే సాంగ్ ని చేశారు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ తాను కలిసి కీబోర్డ్ ప్లేయర్లుగా పనిచేసినట్టు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆలీ తమన్ వచ్చిన తర్వాత మణిశర్మ అక్కర్లేదు అనుకునే వారికి ఈ సమాధానం ఏంటి అని ప్రశ్నించగా.

కాలమే సమాధానం చెబుతుంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు మణిశర్మ.కాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.