నా భార్య ఆ రూట్ లో వెళ్లింది.. అందుకే వదిలేసా అంటున్న సీనియర్ హీరో!
TeluguStop.com
ఒకప్పటి చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారందరిని వారి జ్ఞాపకాలను తెలియజేసుకుంటూ, వాళ్లకు సంబంధించిన అనేక విషయాలను" ఆలీతో సరదాగా "అనే కార్యక్రమం ద్వారా వారి జ్ఞాపకాలను ప్రజలకు తెలియజేస్తుంటారు.
ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది సినీ తారలు పాల్గొని వారి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగానే అప్పట్లో కుటుంబ కథా చిత్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన హీరో.
నేటితరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మైసూరు శేషయ్య సురేష్ బాబు అలియాస్ సురేష్ ఈ వారం ఆలీతో సరదాగా కార్యక్రమానికి పాల్గొని తన వ్యక్తిగత విషయాలను గురించి అభిమానులతో పంచుకున్నారు.
సురేష్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
తెలుగులో హీరోగా "పుట్టింటి పట్టుచీర" సినిమాలో సురేష్ , యమున హీరో హీరోయిన్లుగా నటించారు.
తను నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది.దీంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
సురేష్ బాబు ,సౌందర్య తో కలిసి నటించిన "అమ్మోరు "సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.
ప్రస్తుతం సురేష్ బాబు సైడ్ ఆర్టిస్ట్ గా తండ్రి, సోదరుడు పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/02/suresh-orced-to-his-wife-anitha!--jpg "/
తెలుగు తమిళ భాషల్లో దాదాపు 240 చిత్రాలకు పైగా నటించారు.
కేవలం నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.బుల్లితెరపై ప్రసారమైన" మైనేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహలక్ష్మి, రాజేశ్వరీ కళ్యాణం", వంటి సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఈ విధంగా తన వృత్తి పరమైన విషయాలను ఆలీతో పంచుకున్న సురేష్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అలీ అమ్మని ఎంతో ప్రేమించే మీరు భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.
అందుకు సురేష్ బాబు సమాధానం చెబుతూ ఇప్పటివరకు ఈ విషయం గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు.
ఎక్కడో నా భార్య ఆ రూట్లో వెళ్లిన ఫీలింగ్ నాలో కలగడంతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నానని ఈ సందర్భంగా తన మొదటి భార్య గురించి తెలియజేశారు.
అప్పటికి మా ఇంట్లో వాళ్ళు ఓ బిడ్డ పుడితే అన్ని సర్దుకు పోతాయని చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేదని సురేష్ బాబు తన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేశారు.
అయితే సురేష్ బాబు జీవితం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమోను ఇక్కడ చూడవచ్చు.
పుష్ప2 లో ఆ సీన్ వల్ల నరకం చూసిన అల్లు అర్జున్.. వామ్మో ఇంత కష్టపడ్డారా?