హుస్నాబాద్ కాంగ్రెస్ లో అసంతృప్తి..”పొన్నం” టికెట్ పై ఆగ్రహం..!

ఒకప్పుడు ఎర్రజెండా పార్టీలకు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్ (Husnabad) ప్రాంతం ఆ తర్వాత మార్పు చెందుతూ వచ్చింది.

ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, బిజెపి, పార్టీలు ప్రధానంగా ఉన్నాయి.

ఇలాంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాల నుంచి ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ (Oditela Sathish Kumar) బీఆర్ఎస్ జండా ఎగరవేశారు.

ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతానని బలంగా చెబుతున్నారు.ఇదే తరుణంలో కేసీఆర్ ప్రచార సభ కూడా హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.అన్ని రాజకీయ పార్టీలు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాయి.

అలాంటి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సతీష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) టికెట్ కోసం పోటీ పడ్డారు.

ఇదే తరుణంలో అధిష్టానం పొన్నం ప్రభాకర్ కి టికెట్ కేటాయించింది.దీంతో అలిగిరెడ్డి వర్గం తీవ్రంగా రియాక్ట్ అయింది.

నాన్ లోకల్ వ్యక్తులకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తోంది.ఈ క్రమంలోనే ప్రవీణ్ రెడ్డి ప్రధాన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.

"""/" / ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి (Praveen Reddy) మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలను, నేతలందరినీ ఏకం చేసి పార్టీని గెలుపు తీరాలకు తీసుకువచ్చానని అన్నారు.

దాదాపుగా 90 గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశానని తెలియజేశారు.అంతేకాకుండా అధిష్టానం కూడా నాకే టికెట్ ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చి నన్ను ప్రచారం చేసుకోమని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / ఇప్పటికే నన్ను రెండుసార్లు మోసం చేశారని, నాన్ లోకల్ వ్యక్తులకు టికెట్ కేటాయించడం సమంజసం కాదని అన్నారు.

ఏడు పార్లమెంటరీ పరిధిల్లో హుస్నాబాద్ నియోజకవర్గం ముందంజలో ఉందని, మీకే టికెట్ పక్కా వస్తుందని హామీ ఇచ్చారని చెప్పారు.

కానీ చివరి సమయంలో వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఏ విధంగా కేటాయించాలని ప్రశ్నించారు.

మా కార్యకర్తలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారి కోరిక మేరకే ఒకటి రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేశారు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.

ఈ విధంగా కాంగ్రెస్ లో పుట్టిన రగడతో హుస్నాబాద్ లో బిఆర్ఎస్ (BRS) కు తిరుగు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరి చూడాలి ప్రవీణ్ రెడ్డిని అధిష్టానం కాంప్రమైజ్ చేస్తుందా.లేదంటే వదిలేస్తుందా అనేది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.

ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ను రీవీల్ చేసిన బిగ్ బాస్.. ఎవరో తెలుసా?