వీడియో: శివ భక్తులకు బీరు ఆఫర్ చేసిన యువకుడు.. దూల తీర్చిన పోలీసులు!
TeluguStop.com
శనివారం రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఎంతో ఘనంగా సంబరాలు చేసుకున్నారు.భారతదేశ వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటికిటలాడాయి.
ఇంకా యాత్రలు కూడా జరిగాయి.ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తంగంజ్ ప్రాంతాలలో కన్వర్ యాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
మహాశివరాత్రి సమయంలో, శివ భక్తులు గంగా నది నుంచి నీటిని తెచ్చి శివునికి సమర్పించడానికి కన్వర్ యాత్ర అనే యాత్రకు వెళతారు.
ఈ కష్టమైన ప్రయాణంలో కొంతమంది భక్తులకు ఆహార పానీయాలు అందజేస్తారు. """/" /
అయితే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి సాధారణ ఫలహారాలకు బదులు కన్వారియాలకు బీర్ అందించాడు.
ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనంతరం అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.బీరు ఆఫర్ చేసినందుకు అతడిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చాలా మంది క్వశ్చన్లు వేయటం మరింత ఆగ్రహానికి గురిచేసింది.
"""/" /
మద్యం విక్రయించడానికి అతనికి లైసెన్స్ ఉండకపోవచ్చని కానీ అతను దానిని విక్రయించడం లేదు ఉచితంగా అందిస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు చేశారు.
పవిత్రమైన ప్రార్థనలు చేసేందుకు వెళ్లే సమయంలో కన్వారియాలు బీరు ఇవ్వడం చాలా పాపమని భక్తులు అంటున్నారు.
కన్వారియాలకు ఆల్కహాల్ ఇవ్వడం చాలా పెద్ద తప్పు అని ఇంకొందరు కామెంట్ చేశారు.
కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసి చాలా మంది ఫైర్ అవుతున్నారు.
మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.
అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?