ప్రెగ్నెంట్ అయిన ఆ సినిమాలో నటించడానికి అదే కారణం: అలియా భట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అలియా భట్( Alia Bhatt ) తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే.

ఈమె RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత ఈమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో విడుదలై మంచి గుర్తింపు పొందింది.

అయితే ఈమె గత ఏడాది నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

పెళ్లి తర్వాత వెంటనే పాప కూడా జన్మించడంతో ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. """/"/ ఇకపోతే తాజాగా ఈమె నటించిన మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్స్( Heart Of! Stones ) నుంచి టీజర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ హాలీవుడ్ సినిమా( Hollywood Movie ) నుంచి టీజర్ విడుదల కావడంతో ఈ సినిమా గురించి అలియా భట్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా ఆలియా భట్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆయనప్పటికీ తాను వెనకడుగు వేయకుండా ఈ సినిమాని వదులుకోకుండా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని తెలిపారు.

"""/"/ ఇది తనకు వచ్చిన మొట్టమొదటి హాలీవుడ్ అవకాశం అయితే ఈ సినిమాలో కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలు పూర్తి చేసిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ ( Pregnancy ) కన్ఫర్మ్ అయింది.

అయితే ఆ సీన్స్ సరిగ్గా రాకపోవడంతో తిరిగి షూట్ చేయాలని భావించారు.అప్పటికి ప్రెగ్నెన్సీ అనే విషయం తెలియడంతో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించారని తెలిపారు.

అయితే ఈ సినిమా తనకు మొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ప్రెగ్నెన్సీ ఉన్న ఈ సినిమాని వదులుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్ పూర్తి చేశానని ఆలియా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం.. ఏ శాఖకు ఎన్ని కోట్లంటే?