Alia Bhatt: అలియాభట్ తల్లీదండ్రులు అలాంటి కష్టాలు అనుభవించారా.. నాన్న మద్యానికి బానిస అయ్యాడంటూ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో అలియా భట్(Alia Bhatt) కుటుంబం ఒకటి.

ఈమె ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్(Mahesh Bhatt) వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాలలో అలాగే హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నటువంటి అలియా భట్ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.

అలియా భట్ గత ఏడాది వివాహం చేసుకొని బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం పాపా ఆలనపాలన చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియా భట్ తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన తండ్రి చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో( Movies Flop ) ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు.

వరుస సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని ఇలా డబ్బు నష్టపోవడంతో తన తండ్రి తాగుడుకు అలవాటు పడ్డారని అలియా భట్ వెల్లడించారు.

"""/" / ఇలా తాగుడికి బానిసగా మారినటువంటి తన తండ్రి కొన్ని రోజుల తర్వాత మద్యానికి( Alcohol ) దూరంగా ఉన్నారు.

అనంతరం సినిమాలపై ఈయన ఫోకస్ చేశారని తిరిగి నాన్న సినిమాలను చేస్తూ ఎంతో కష్టపడటంతోనే మేము ఈ స్థాయికి వచ్చాము అంటూ ఈ సందర్భంగా ఆలియా భట్ తన తండ్రి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక అలియా భట్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు ఇలా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి ఈమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఈమె నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…