అలియా భట్ సీతగా మారడానికి ఎంత కష్టపడిందో చూశారా.. మేకింగ్ వీడియో వైరల్!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

జనవరి 7, 2022 న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అయితే అంచనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కు సుమారుగా 450 కోట్లు ఉండవచ్చు సమాచారం.

ఇక డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ రాబోతోంది.ఆ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాలలోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు చిత్రబృందం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ వీడియోలో అలియా నుంచి సీతగా మారే విధనాన్ని చూపించారు.అందులో ఆలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్ ను చూపించారు.

ఇందులో ఆలియాభట్ క్యూట్ క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. """/" / ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై మరింత హైప్ ను పెంచాయి.

కాగా వీటికి అనూహ్యమైన స్పందన వస్తోంది.

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు