ఇదేందయ్యా ఇదీ.. అలియా రణబీర్ లకు మళ్లీ పెళ్లి చేసిన ఫ్యాన్స్.. ఏమైందంటే?
TeluguStop.com
తాజాగా బాలీవుడ్ ప్రేమజంట అలియా భట్-రణబీర్ లు మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ జంట ఎప్పుడెప్పుడు ఒకటవుతారా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.
ఏప్రిల్ 14, గురువారం ముంబైలోని వాస్తు అపార్ట్మెంట్ లో ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది.
పెళ్లి ఘనంగా జరిగినప్పటికీ ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అది కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన తరువాత అలియా భట్-రణబీర్ లు ఫోటోల ద్వారా వారి పెళ్లి విషయాన్ని షేర్ చేశారు.
అంతేకాకుండా వారిద్దరూ ఐదేళ్లుగా ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకుంటున్నారు ప్రస్తుతం అదే బాల వివాహం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రిసెప్షన్ ఏప్రిల్ 17న గ్రాండ్ గా జరగబోతోంది అని సమాచారం.అందుకు ముంబైలోని తాజ్ వేదికగా మారబోతోంది.
ఇక వీరి రిసెప్షన్ కు చాలా పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలియా భట్-రణబీర్ ల రిసెప్షన్కు సెలబ్రిటీస్ తో పాటు, పొలిటికల్ లీడర్స్,అలాగే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు.
ఇకపోతే ఈ జంటకు సపరేట్ గా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
"""/"/
బాలీవుడ్ హీరో - హీరోయిన్ అంటే ఫాన్స్ కి విపరీతమైన ప్రేమ ఉంటుంది.
అయితే నిన్న అలియా భట్ - రణబీర్ ల పెళ్లి ఫామిలీస్ మధ్యన జరగగా.
కొంతమంది అభిమానులు అలియాని, రణబీర్ ల పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మలని తయారు చేసి ఆ బొమ్మలకి అలియా, రణబీర్ ల ఫేస్ పోస్టర్స్ పెట్టి పద్దతి ప్రకారం పంతుల గారిచేత వివాహం చెయ్యడం అందరిని ఆకర్షించింది.
కలకత్తాలోని అలియా - రణబీర్ ల అభిమానులు ఇలా అలియా బొమ్మ పెళ్లి కూతురు, రణబీర్ బొమ్మ పెళ్లి కొడుకులకి ఘనంగా బెంగాలీ స్టైల్ లో వివాహం చేసి ఊరేగించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..