చిన్న పిల్లల బట్టల వ్యాపారం మొదలు పెట్టిన అలియా భట్
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సినిమాలతో పాటు సైడ్ వ్యాపారాలు కూడా చేస్తున్నారు.
క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే పాత సామెతకి కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు.
చేతిలో నిండుగా ఉన్న డబ్బులని ఏదో ఒక వ్యాపారంలో పెడుతున్నారు.అయితే చేసే వ్యాపారాలు కూడా ఏదో రెగ్యులర్ కి కాకుండా కచ్చితంగా ప్రాఫిట్ ఉండే బిజినెస్ ల మీద పెట్టుబడులు పెడుతున్నారు.
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, సమంత లాంటి స్టార్స్ బట్టల వ్యాపారాలు మొదలు పెట్టారు.
వీరి దారిలో పాయల్ రాజ్ పుత్ కూడా చేరిపోయి కొత్తగా ఫాషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది.
అలాగే రకుల్ అయితే ఫిట్ నెస్ సెంటర్ స్టార్ట్ చేసింది.అలాగే బాలీవుడ్ భామలు కూడా ఇలా సైడ్ వ్యాపారాలతో బాగానే సంపాదిస్తున్నారు.
ఇప్పుడు వీరి దారిలోకి మరో బాలీవుడ్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కూడా వచ్చి చేరింది.
"""/"/
ఈ భామ కొత్తగా బట్టల వ్యాపారం మొదలు పెట్టింది.అయితే రెగ్యులర్ గా అందరి దారిలో వెళ్తే కొత్తదనం ఏముందిలే అని అనుకుందేమో.
బట్టల వ్యాపారం అయినా అలియా స్టార్ట్ చేసింది చిన్న పిల్లల బట్టలు వ్యాపారం.
అలియా చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం వ్యాపారం ప్రారంభించడంతో పాటు అందులో ఎవరైనా పార్ట్నర్స్ గా చేరడానికి కూడా ఆహ్వానం పలుకుతుంది.
ఆసక్తి ఉన్న వారు తన కంపెనీలు పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపింది.ఎడ్ ఏ మమ్మా పేరుతో చిన్నపిల్లల దుస్తుల వ్యాపారానికి సంబందించిన అవుట్ లెట్స్ ని కూడా అలియా స్టార్ట్ చేయబోతుంది.
మరి ఈ అమ్మడు బట్టలకి మార్కెట్ లో ఎంత వరకు గిరాకీ లభిస్తుంది అనేది చూడాలి.
ఆ దేశంలో సైతం విడుదలవుతున్న ఎన్టీఆర్ దేవర.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!