ఆ వ్యాపారంలో కళ్లు చెదిరే లాభాలు సంపాదించిన అలియా.. ఏమైందంటే?

ఆర్.ఆర్.

ఆర్ సినిమా సక్సెస్ తో సౌత్ ఇండియాలో కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అలియా భట్( Alia Bhatt ) ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఈ స్టార్ హీరోయిన్ బిజినెస్ లో దూసుకెళుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.అలియా భట్ వ్యాపారంలో( Alia Bhatt Business ) కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

2022 సంవత్సరంలో అలియా భట్ ఎడ్-ఎ-మామా( Ed-a-mama ) పేరుతో దుస్తుల విక్రయాలను మొదలుపెట్టింది.

అలియా భట్ గ్లామర్ రోల్స్ తో పాటు అభినయ ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండటం గమనార్హం.

ఎడ్-ఎ-మామా కంపెనీ విలువ 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

కేవలం ఏడాది కాలంలో ఈ కంపెనీ విలువ ఏకంగా 10 రెట్లు పెరిగింది.

చిన్న పిల్లల నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు కంపెనీ వెబ్ సైట్ లో 700 నుంచి 800 వస్తువులు అందుబాటులో ఉన్నాయని సమాచారం.

"""/" / తాను బిజినెస్ ను నిర్వహించడం గురించి చాలా విషయాలను నేర్చుకున్నానని అలియా భట్ పేర్కొన్నారు.

ఈ బిజినెస్ ను చిన్న కలగా మొదలుపెట్టానని ఇప్పుడు ఈ వ్యాపారం 150 కోట్ల రూపాయల బిజినెస్ గా మారిందని అలియా నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అలియా భట్, రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. """/" / పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి కాగా ఈ జంట రాహా అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

తాజాగా అలియా భట్ 30వ పుట్టినరోజును జరుపుకున్నారు.అలియా భట్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరిన్ని సౌత్ ప్రాజెక్ట్ లతో అలియా భట్ బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నా అలియా భట్ మాత్రం బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు.

మహేష్ జక్కన్న మూవీ బిజినెస్ లెక్కలివే.. ఆ రికార్డ్ సాధించే తొలి సినిమా కానుందా?