జక్కన్న పై అలిగిన ఆలియా భట్‌.. కారణం ఇదేనా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు జీవితాంతం ఆయనకు రుణపడి పోవాలి అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారు కెరీర్ మొత్తంలో కూడా ఈ స్థాయి సినిమా కచ్చితంగా మళ్ళీ చేయలేక పోవచ్చు అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఎన్టీఆర్ మరియు రాంచరణ్ జీవితాంతం రాజమౌళికి రుణపడి పోతారు అంటూ ఈ సమయంలో సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.

హీరోలు మాత్రమే కాకుండా సినిమాలో నటించిన పలువురు నటీనటులు కూడా రాజమౌళి దేవుడిగా పూజిస్తున్నారు.

"""/"/ తమకు అద్భుతమైన సినిమా వచ్చింది అంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తనకు చెప్పిన కథ వేరు.తన చేసిన సన్నివేశాలు వేరు.

సినిమాలో ఉన్న సన్నివేశాలు వేరు అంటూ ఆలియా ఆగ్రహంతో రగిలిపోతున్న సమాచారం అందుతుందట.

ఈ విషయం లో రాజమౌళి పై ఆమె తీవ్ర స్థాయి లో కోపం తో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తన పాత్ర కు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని.నిడివి నలభై నుంచి యాభై నిమిషాల వరకు ఉంటుందని రాజమౌళి చెప్పాడని, కానీ తీరా చూస్తే పది నిమిషాల నిడివి కూడా లేదని సినిమా లో అసలు ప్రాముఖ్యత లేని పాత్రను తనకు అంట కట్టాడు అంటూ తన అసంతృప్తి వ్యక్తం చేస్తోందట.

ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కానీ అసలు విషయం ఏంటి అనేది ఆలియా మాట్లాడితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

అయోధ్య రామ మందిరం విరాళం లెక్కలు ఇవే.. అన్ని క్వింటాళ్ల బంగారం, వెండి వచ్చిందా?