రామరాజు, సీత మరోసారి.. పుకార్లా? నిజమా?.
TeluguStop.com
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో హీరోయిన్ గా రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే.
అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా ఆయన మరదలు సీత పాత్రలో ఆలియా కనిపించబోతుంది.
వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలు సినిమా కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ఇక ఆలియా భట్ ఆ తర్వాత కూడా తెలుగులో మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.
అది కూడా రామ్ చరణ్ తోనే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తదుపరి సినిమా లో ఆలియా భట్ హీరోయిన్ గా దాదాపు ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.
కాని ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుండి మాత్రం అధికారికంగా స్పష్టత రాలేదు.
రామ్ చరణ్, శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కు గాను హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.
కాని ఇప్పటి వరకు శంకర్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే చేస్తున్నాడు.అంతకు మించి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదంటున్నారు.
షూటింగ్ ప్రారంభింకు ఇంకా సమయం ఉంది కనుక ఆలియా భట్ ను ఎంపిక చేయడం అనేది నిజం అయ్యి ఉండక పోవచ్చు అంటున్నారు.
ఎందుకంటే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు.అప్పటి వరకు ఆలియా భట్ పలు సినిమాలతో బిజీగా ఉంది కనుక డేట్ల ఇష్యూ వచ్చే అవకాశం ఉంది.
కనుక మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తుంది.రామరాజు మరియు సీత పాత్రలో కనిపించబోతున్న రామ్ చరణ్ ఆలియా భట్ లు మళ్లీ శంకర్ సినిమాలు నటించడం అనేది దాదాపు అసాధ్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.
త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రశాంత్ వర్మ ఖాతాలో మరో ప్లాప్ సినిమా…కారణం ఏంటి..?