రెండోసారి తల్లి కాబోతున్న అలియా….బిడ్డకు పేరు కూడా ఫిక్స్…. ఏంటో తెలుసా?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నటి అలియా భట్( Alia Bhat ) ఒకరు.
ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమె నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
అలియా భట్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న ఆలయా భట్ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు రాహ( Raha ) అనే కుమార్తె కూడా ఉన్నారు.అయితే అతి త్వరలోనే ఈమె మరో శుభవార్తను కూడా చెప్పబోతున్నారని తెలుస్తోంది.
ఈ దంపతులిద్దరూ కూడా తమ రెండో బిడ్డను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పరోక్షంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.
"""/" /
ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ రాహ కడుపులో ఉన్న సమయంలో తనకు ఏ పేరు పెట్టాలా అని బాగా ఆలోచించాము అందుకే తన స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మంచి పేర్లను సేకరించి ముందుగానే తన పేరును సెలెక్ట్ చేశామని తెలిపారు.
ఈ పేరు అమ్మాయికైనా అబ్బాయి కైనా బాగుంటుందని సెలెక్ట్ చేసాము అని తెలిపారు.
అయితే ప్రస్తుతం మరోసారి కూడా తన స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి ఇలా పేర్లను కలెక్ట్ చేస్తున్నట్లు ఈమె వెల్లడించడంతో మరోసారి ఈమె తల్లి కాబోతుందని చెప్పకనే చెప్పేశారు.
అయితే ఈసారి ఎక్కువగా అబ్బాయి పేర్లను పంపించమని చెప్పారట దీంతో వీరికి పుట్టబోయేది మగ బిడ్డ అని, ఇప్పటికే పేరు కూడా సెలెక్ట్ చేశారు కానీ ఆ పేరును మాత్రం ఈమె బయట పెట్టలేదని తెలుస్తోంది.
మరోసారి ఆలియా తల్లి కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.