ఆ షో కు మంచు విష్ణు అందుకే వచ్చాడా.. ట్రోల్ అవుతున్న కమెడియన్ అలీ!

బుల్లి తెరపై అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఆలీతో సరదాగా.తాజాగా ఈ కార్యక్రమానికి ఈ వారం మంచు విష్ణు అతిథిగా వచ్చారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది నేపథ్యంలో ఈ విధంగా మంచు విష్ణు ఈ కార్యక్రమానికి తీసుకురావడం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు అలీ మంచు విష్ణును ఈ కార్యక్రమానికి ఎందుకు తీసుకువచ్చాడు? పబ్లిసిటీ కోసమే మంచు విష్ణును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా అంటూ పలువురు నెటిజన్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో గత వారం విడుదల చేయడంతో చాలా మంది ఈ కార్యక్రమంపై దృష్టిసారించారు.

ఇకపోతే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మంచు విష్ణు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎపిసోడ్ యూట్యూబ్ లో విడుదల చేశారు.

అయితే విడుదల చేసిన కొద్దిసేపటికి ఈ వీడియోను డిలీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"""/"/ ఈ విధంగా డిలీట్ చేసిన కొంత సమయానికి ఈ వీడియో కంటెంట్ నిడివిని పెంచుతూ మరి పోస్ట్ చేయడంపై ప్రేక్షకులు కొంత మేర గందరగోళానికి గురయ్యారు.

అసలు ఈ విధంగా డిలీట్ చేస్తూ అప్లోడ్ చేయడానికి కారణం ఏమిటి? మా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విష్ణు ఈ కార్యక్రమానికి రావడం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

"""/"/ ఈ క్రమంలోనే మంచు విష్ణును హైలెట్ చేయడం కోసం మా ఎన్నికలలో విష్ణుకి బూస్టప్ ఇవ్వడం కోసం అలీ ఈ కార్యక్రమానికి విష్ణును ఆహ్వానించారా అంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డిలీట్ చేయడం ఆ తర్వాత అప్లోడ్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే చేశారా లేకపోతే సాంకేతిక సమస్యల కారణంగా ఈ విధంగా చేశారా అనే విషయం తెలియడం లేదు.

ఏదిఏమైనప్పటికీ అలీ విధంగా చేయడంపై నెటిజన్లు దారుణంగా తనని ట్రోలింగ్ చేస్తున్నారు.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?