మరోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్ అలీ.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్  ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆలీ( Comedian Ali ) ఒకరు.

బాలా నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ తన కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ స్టార్ కమెడియన్గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇలా కమెడియన్ గా కొనసాగుతూనే ఈయన బుల్లితెరపై కూడా ఎన్నో షోల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ సందడి చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం గారి తర్వాత అంతటి గుర్తింపు పొందిన కమెడియన్ ఎవరైనా ఉన్నారా అంటే అది అలీ మాత్రమే అని చెప్పాలి.

"""/" / ఇకపోతే ఇటీవల కాలంలో అలీ కాస్త సినిమాలను తగ్గించారు.ఏదైనా మంచి పాత్ర ఉంటే తప్ప ఆయన సినిమాలలో నటించడం లేదని చెప్పాలి.

ఇక రాజకీయాలలో కొనసాగుతున్న ఈయన గత కొద్ది రోజుల క్రితం తాను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలియజేశారు.

ఇకపోతే అలీ భార్య జుబేదా( Zubeda Ali )యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈమె తమకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / తాజాగా అలీతో రెండో పెళ్లికి( Second Marriage ) సంబంధించిన వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇటీవల అలీ జుబేదా ముప్పై వ వివాహ వార్షికోత్సవం రావడంతో తన ఇద్దరు కుమార్తెలు తన కొడుకు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ముస్లిం కుటుంబ సంప్రదాయ ఆచారాల ప్రకారం మరోసారి అలీ జుబేదా పెళ్లి వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇందులో భాగంగా అలీ జుబేదా దంపతులకు తన కుటుంబ సభ్యులు హల్దీ మెహందీ సంగీత్ నిఖా వంటి అన్ని కార్యక్రమాలను ఎంతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.