Ali Sobhan Babu : నల్ల బంగారం మీద ఇన్వెస్ట్ చేయమని శోభన్ బాబు చెప్పారు.. అలీ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కామెడీ టైమింగ్ తో దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన కమెడియన్లలో అలీ( Comedian Ali ) ఒకరు.
అలీ శోభన్ బాబు గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాలనటుడిగా పలు సినిమాలలో నటించిన అలీ ప్రస్తుతం అలీతో సరదాగా( Alitho Saradaga ) షోతో బిజీగా ఉన్నారు.
ఏపీ ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.
నాకు మంచి గుర్తింపు వచ్చిన తర్వాత నేను ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసేవాడినని అలీ కామెంట్లు చేశారు.
ఆ సమయంలో శోభన్ బాబు గారు ( Sobhan Babu ) డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారని అలీ చెప్పుకొచ్చారు.
ఆర్టిస్ట్ అనేవాడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని శోభన్ బాబు సూచించారని అలీ వెల్లడించడం గమనార్హం.
డబ్బు లేకుండా ఆకలితో అలమటిస్తుంటే నీ కులం వ్యక్తి కూడా నీకు సహాయం చేయడని ఆయన నాతో చెప్పారని అలీ పేర్కొన్నారు.
నల్ల బంగారం (భూమి) పై ఇన్వెస్ట్ చేయాలని శోభన్ బాబు సూచించారని అలీ తెలిపారు.
"""/" /
కష్టాల్లో ఉన్న సమయంలో ఎవడూ నీకు బిర్యాని ప్యాకెట్ కూడా ఇవ్వడని స్నేహితులు, బంధువులు కూడా సహాయం చేయరని ఆయన నాతో చెప్పారని అలీ చెప్పుకొచ్చారు.
నీకు అప్పు అడిగే ఉద్దేశం లేకపోయినా నీ దగ్గరికి రారని ఇది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారని అలీ వెల్లడించడం గమనార్హం.
అలీ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. """/" /
అలీ ఈ ఎన్నికల్లో వైసీపీ( YCP ) తరపున ప్రచారం చేస్తారో లేదో చూడాల్సి ఉంది.
అలీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.అలీ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.
వెండితెరపై సీనియర్ కమెడియన్ల హవా గతంతో పోల్చి చూస్తే తగ్గిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!