అతడిపై విషప్రయోగం నిజమే అని తేల్చి చెప్పిన వైద్యులు!

అతడిపై విషప్రయోగం నిజమే అని తేల్చి చెప్పిన వైద్యులు!

ఇటీవల రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్ని పై విషప్రయోగం జరిగింది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అతడిపై విషప్రయోగం నిజమే అని తేల్చి చెప్పిన వైద్యులు!

అయితే ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా ఎలెర్జిక్ అవ్వడం తో ఏదైనా వాసన కారణంగా ఆయన ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారా అంటూ అక్కడి అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

అతడిపై విషప్రయోగం నిజమే అని తేల్చి చెప్పిన వైద్యులు!

అయితే మాస్కో నుంచి సైబీరియాకు విమానంలో వెళుతున్న సమయంలో ఆయన ఉన్నట్టుండి కుప్పకూలడం తో హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం జర్మనీ తరలించారు.

అయితే అక్కడ నవాల్ని కి వైద్యం అందిస్తున్న వైద్యులు అతడిపై నిజంగానే విష ప్రయోగం జరిగింది అని వారు తేల్చి చెప్పారు.

అతడిపై క్లోనిస్టరేజ్ రసాయనాల ను ఉపయోగించి విషప్రయోగం చేశారని జర్మనీ డాక్టర్లు ధృవీకరించారు.

విషప్రయోగం జరగడం వల్లే ఆయన కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది అని వైద్యులు తెలిపారు.

ఇటీవల ఆయన మాస్కో నుంచి సైబీరియాకు విమానంలో వెళుతున్న సమయంలో ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపడిపోయారు.

అయితే ఉదయం నుంచి టీ మాత్రమే తీసుకున్న నవాల్ని కుప్పకూలిపడిపోవడం తో అతడిపై విషప్రయోగం జరిగింది అని అతడి ప్రతినిధి ఆరోపించారు.

అయితే ఇదే విషయం జర్మనీ డాక్టర్లు కూడా స్పష్టం చేయడం తో అతడిపై విషప్రయోగం జరిగినట్లు అర్ధం ఆవుతుంది.

44 ఏళ్ల నవాల్ని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విధానాలను ఎండగడుతూ గత కొంతకాలంగా అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు.

అలాంటి అతడిపై విషప్రయోగం జరగడం తో కావాల‌నే విష‌ప్ర‌యోగం చేయించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అయితే క్లోనిస్ట‌రేజ్ ర‌సాయ‌నాల వల్ల విషప్రయోగం జరగడం తో ఆయన కోమాలోకి వెళ్లారని,అయితే దీనివల్ల ఎటువంటి వ్యాధి వస్తుంది అన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేము కానీ,నాడీ వ్యవస్థకు సంబందించిన రుగ్మతులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అంటూ ఆయనకు వైద్యం అందిస్తున్న బెర్లిన్ వర్సిటీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.