అలెర్ట్: ఫోన్లో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే అంతే సంగతులు..!

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ముఖ్యమైన గమనిక.మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్ లో కనుక ఈ యాప్ ఉన్నట్లయితే వెంటనే డిలీట్ చేసేయండి.

లేదంటే మీ డేటా అంతా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.నిజానికి మనం గూగుల్ ప్లే స్టోర్‌ నుండి డౌన్లోడ్ చేసుకునే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ సురక్షితమైనవి కావు.

ఎన్నో వేల కొలది యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లో మనకు కనిపిస్తాయి.వాటిని సురక్షితం అని భావించి డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది.

అందుకే ఎప్పటికప్పుడు సైబర్ నిపుణులు ఇలాంటి హానికరమైన యాప్స్ ను గుర్తించి మనల్ని అప్రమత్తం చేస్తుంటారు.

అలాంటి డేంజరస్ యాప్స్ ఏమన్నా గూగుల్ ప్లేస్టోర్ లో కనిపెడితే వెంటనే వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటారు.

అయితే తాజాగా సైబర్ నిపుణులు మరో డేంజరస్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లో గుర్తించడం జరిగింది.

మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ అయిన ప్రేడియో ఈ యాప్ ను గుర్తించింది.

ఈ యాప్ కనుక మీ ఫోన్ లో ఉంటే మీ యొక్క ఫేస్‌బుక్ డేటాను చోరీ చేస్తుంది.

ఇది ఒక కార్టూన్ ఫిల్టర్ యాప్‌ అన్నమాట.గూగుల్ ప్లే స్టోర్ లో "Craftsart Cartoon Photo Tools" అనే పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉండేది.

ఈ యాప్ అంత సురక్షితం కాదని, ఇందులో ట్రోజన్ ఉందని తెలియడంతో ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేసారు గూగుల్ ప్రతినిధులు.

కానీ ఇప్పటికే ఈ యాప్ ను దాదాపు లక్ష మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు.

ఈ యాప్ ను ఉపయోగించి యూజర్లు తమ ఫోటోను అప్లోడ్ చేసి కార్టూన్‌గా మార్చుకోవచ్చు.

కాగా ఈ యాప్ ను ఉపయోగించాలంటే తప్పనిసరిగా హోమ్ స్క్రీన్‌లో ఫేస్‌బుక్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

"""/"/ కానీ ఈ కార్టూనిఫయర్ యాప్‌లో ఫేస్‌స్టీలర్ అనే ట్రోజన్ ఉందని ప్రేడియో రీసెర్చెర్స్ గుర్తించారు.

ఒకవేళ మీరు కనుక ఈ యాప్ ను ఇంకా మీ ఫోన్ లో ఉంచినట్లయితే యూజర్ల ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్ అంటే ఫేస్‌బుక్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలన్ని హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

అందుకే ఈ హానికర యాప్‌ను గూగుల్ ఎప్పుడో తొలగించింది.ఒకవేళ మీరు కనుక ఇప్పటికే డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే అన్ ఇన్స్టాల్ చేసుకోండి.

అయితే గూగుల్ ప్లేస్టోర్‌ లో ఇలాంటి హానికరమైన యాప్స్ చాలా ఉంటాయి.నచ్చిన ప్రతీ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకోకుండా ముందు ఆ యాప్‌ గురించి తెలుసుకోండి.

దానిని ఎవరు డేవలప్ చేసారో ఆ పేరు చూడండి.అలాగే యాప్ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.

ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌లో గల యాప్స్‌ అసలు ఉపయోగించకపోవడమే మంచిది.