రైతులకు అలెర్ట్.. ఈ తప్పులు చేస్తే మీ ఖాతాలో డబ్బులు జమ కావు!

పీఎం కిసాన్ 10వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు త్వరలోనే రైతుల బ్యాంకు అకౌంట్లో జమ కానున్నాయి.

ఆ సమయంలోగా కొన్ని తప్పులను కరెక్ట్ చేసుకోకపోతే రైతుల బ్యాంకు అకౌంట్ లోకి నగదు ట్రాన్స్‌ఫర్ కాదని కేంద్రం చెబుతోంది.

ఈ పథకం కింద లబ్ధి పొందడానికి రైతులు ప్రధానంగా తమ ఆధార్ కార్డుతో పీఎం కిసాన్ అకౌంట్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ బ్యాంకు వివరాలు తప్పుగా ఇచ్చినా.డబ్బులు ఖాతాలో జమ కావు.

అయితే త్వరలోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయనున్నామని.ఆ సమయంలోగా ఆధార్ కార్డు లేదా బ్యాంకు అకౌంట్ వివరాలు సరిచూసుకోవాలని కేంద్రం రైతులను కోరుతోంది.

ఒకవేళ తప్పులు ఉంటే.వాటిని ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆధార్ కార్డుతో లింకైన రైతుల బ్యాంకు ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా డబ్బులు జమవుతాయి.

ఇంతకు మునుపు కొందరి రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు.ఇందుకు కారణం వారు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తప్పుగా ఇచ్చి ఉండొచ్చు.

ఆధార్ నంబర్‌ను తప్పుగా నమోదు చేశామనే అనుమానం వచ్చినట్లయితే.పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లోనే స్టేటస్ చూసి ఆధార్ నంబర్‌ను సరైనది ఇచ్చామో లేదో నివృత్తి చేసుకోవచ్చు.

అంతేకాదు ఆధార్ లేదా బ్యాంకు ఖాతా నంబర్‌ను ఆన్‌లైన్‌లోనే కరెక్ట్ చేసుకోవచ్చు.ఇలా చేయడం ద్వారా తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులు పొందవచ్చు.

"""/" / పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్‌ను ఎలా సవరించాలో ఇప్పుడు చూద్దాం.

మొదటగా పీఎం కిసాన్ వెబ్‌సైట్ Pmkisan.gov!--in విజిట్ చేయండి.

తర్వాత ‘Farmers Corner’ అనే లింక్‌పై నొక్కండి.ఆపై 'Aadhaar Edit' అనే లింక్‌పై క్లిక్ చేయండి.

తర్వాత సరైన నంబర్ ను జాగ్రత్తగా నమోదు చేయండి.బ్యాంకు అకౌంట్ వివరాలు తప్పుగా ఉంటే.

వాటిని కూడా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో వద్దనుకుంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసుకు వెళ్లి కూడా సరైన వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

లబ్దిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ అయిన Pmkisan.

Gov!--in లోకి వెళ్లి 'Beneficiary Status' ట్యాబ్‌పై క్లిక్ చేసి తదితర వివరాలను చెక్ చేసుకోవచ్చు.

Farah Khan : గర్భంలో ఏడున్నర కిలోలు మోశా.. ఒకరిని తీసేస్తాం అన్నారు: ఫరాహ్ ఖాన్