అలర్ట్: వడ్డీ రేట్ల పెంపునకు ఆ బ్యాంకులు రెడీ..!

బ్యాంకులు ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను( Interest Rates ) తగ్గించడమో లేదా పెంచడమో చేస్తూ ఉంటాయి.

ఏ దేశంలోని బ్యాంకులైనా ఇలాగే చేస్తూ ఉంటాయి.దేశ ఆర్ధిక పరిస్థితి ఆధారంగా వడ్డీ రేట్లల్లో మార్పులు చేస్తూ ఉంటాయి.

అయితే తాజాగా అమెరికా ఫెడ్, ఐరోపా, జపాన్ సెంట్రల్ బ్యాంకులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి.

వడ్డీ రేట్లను పెంచాలని చూస్తోన్నాయి.తమ ద్రవ్య విధానాలను ఆ బ్యాంకులు సమీక్షించబోతున్నాయి.

ఇన్ఫ్లేషన్ ఆధారంగా మార్పులు చేయనున్నాయి. """/" / ఇన్ప్లేషన్( Inflation ) ఇప్పటికీ అధికంగా ఉండటంతో రేపో రేట్లను ఐరోపా, జపాన్ సెంట్రల్ బ్యాంకులు పెంచడం ఖాయమని తెలుస్తోంది.

దాదాపు 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటును పెంచేందుకు సిద్దమవుతున్నాయి.బుధవారం అమెరికా ఫెడ్( America Fed ) పాలసీ మేకర్స్ సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోబోతున్నారు.5.

25 నుంచి 5.5 శాతానికి వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని తెలుస్తోంది.

ఇదే జరిగితే 22 ఏళ్లల్లో తొలిసారి అత్యధిక స్థాయికి రెపోరేట్లను పెంచినట్లు అవుతుందని చెబుతున్నారు.

"""/" / చివరి 16 నెలల్లో 11వ సారి పెంచినట్లు అవుతుంది.జూన్‌లో వడ్డీ రేట్లను పెంచకుండా గ్యాప్ ఇచ్చిన ఫెడ్.

జులై నుంచి మళ్లీ పెంచుతూ వస్తోంది.అటు ఐరోపా సెంట్రల్ బ్యాంకు( European Central Bank ) 400 బేసిస్ పాయింట్లు ఇప్పటివరకు రెపో రేటు పెంచింది.

ఈ బ్యాంకుల నిర్ణయాల ప్రకారం ఇండోనేషియా, ఉక్రెయిన్, హంగేరి, ఉజ్బెకిస్థాన్, చిలీ, నైజీరియా, ఘనా, మలావి, లెస్ బ్యాంకులు కూడా రెపోరేటుపై( Repo Rate ) నిర్ణయం తీసుకోనున్నాయి.

పెరుగుతున్న ధరలను అదుపు చేయాలంటే వడ్డీ రేట్లను పెంచడం తప్పనిసరి అని బ్యాంకులు భావిస్తున్నాయి.

అయితే భారత్ లో కూడా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా( RBI ) ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడం లేదా పెంచడం చేస్తూ ఉంటుంది.

విధానపరమైన సమీక్షల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటారు.