అలర్ట్: ఇక ఆ కంపెనీ ప్రతి ఆర్డర్ పై రూ. 2 అదనం వసూలు షురూ..!
TeluguStop.com
ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్( Food Delivery App ) లకు బాగా డిమాండ్ పెరిగింది.
మనకు నచ్చిన ఆహారాన్ని సులువుగా ఇంటి దగ్గర నుంచే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వెసులుబాటు వచ్చింది.
మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి మనకు ఇష్టమైన ఆహారాన్ని ఒక్క క్లిక్ తో ఆర్డర్ చేసుకుంటే నేరుగా ఇంటికే డోర్ డెలివరీ వస్తుంది.
లాక్ డౌన్ టైమ్ లో ఫుడ్ డెలివరీ యాప్ లకు ఆదరణ మరింత పెరిగింది.
దీంతో ఒకసారి ఫుడ్ డెలివరీ యాప్ లకు అలవాటు పడ్డ జనం మళ్లీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు.
రెస్టారెంట్లకు వెళ్లే సమయం లేక యాప్స్ లలో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు.
"""/" /
అయితే ఫుడ్ డెలివరీ యాప్ లలో జోమాటో( Zomato ) అగ్రగామిగా కొనసాగుతోంది.
తాజాగా వినియోగదారులకు జోమాటో షాక్ ఇచ్చింది.ఫుడ్ ఆర్డర్స్ పై రూ.
2 అదనపు ఛార్జీ వసూలు చేస్తోంది.ఆర్డర్ చేసి పుడ్ మొత్తం ఖరీదుతో సంబంధం లేకుండా ఫ్లాట్‌ఫారమ్ ఫీజు పేరుతో ప్రతి ఆర్డర్ పై కస్టమర్ నుంచి రూ.
2 వసూలు చేస్తోంది.స్విగ్గీ( Swiggy ) నాలుగు నెలల నుంచే ఫ్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది.
దీంతో జోమాటో కూడా అదే బాట పట్టింది.ఆదాయాన్ని పెంచుకునేందుకు జోమాటో కూడా ఫ్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేస్తోంది.
జోమాటా ప్రారంభించిన తర్వాత తొలిసారి 12 మిలియన్ల లాభాన్ని 2023-24 త్రైమాసికంలో సంపాదించింది.
దీంతో ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఫుడ్ డెలివరీ యాప్ లు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్లపై 22 నుంచి 28 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తోన్నాయి.
ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే ఫ్లాట్‌ఫారం ఫీజును వసూలు చేస్తోన్నాయి.నిత్యావసర సరుకులు డెలివరీపై ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు.
షార్ట్స్ వేసుకున్న కూతురికి ఫాదర్ ఫన్నీ లెసన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!