ఎల్ఐసీ కస్టమర్లకు అలర్ట్.. వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన సేవలు..

పాలసీదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా వాట్సాప్ సేవలను పరిచయం చేసింది.

8976862090 అనే మొబైల్ నంబర్‌కు వాట్సాప్‌లో "హాయ్" అని మెసేజ్ చేయడం ద్వారా, ఎల్ఐసీ పోర్టల్‌లో తమ పాలసీలను రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను పొందొచ్చు.

ఎల్ఐసీ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా ప్రీమియం డ్యూ, బోనస్ ఇన్ఫో, పాలసీ స్టేటస్, లోన్ అర్హత కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్, లోన్ ఇంట్రెస్ట్ డ్యూ, ప్రీమియం పెయిడ్ సర్టిఫికేట్ ULIP - యూనిట్ల ప్రకటన, ఆప్ట్‌-ఇన్, ఆప్ట్‌-ఔట్ సర్వీసెస్ వంటి చాలా సేవలు అందజేస్తుంది.

ఎల్ఐసీ వాట్సాప్ సేవలను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం.ఎల్ఐసీ పోర్టల్‌లో తమ పాలసీలను రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు వాట్సాప్‌లో ఈ సేవలను ఉపయోగించుకోగలరని గమనించాలి.

రిజిస్టర్ చేసుకున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి పాలసీదారులు మొబైల్ నంబర్.

8976862090కి 'హాయ్' అని వాట్సాప్ మెసేజ్ చేయాలి.అప్పుడు వారికి వెంటనే అన్ని సేవలు కనిపిస్తాయి.

వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని క్షణాల్లోనే సర్వీసెస్ పొందవచ్చు. """/"/ పోర్టల్‌లో పాలసీలను రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ఈజీయే.

ఇందుకు కస్టమర్లు !--wwwlicindia!--in వెబ్‌సైట్‌ను విజిట్ చేసి అందులో కనిపించే “కస్టమర్ పోర్టల్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

మీరు కస్టమర్ పోర్టల్ కోసం ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే “కొత్త యూజర్”పై క్లిక్ చేయాలి.

ఆపై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఎంచుకుని, తర్వాతి స్క్రీన్‌లో సబ్మిట్ చేయాలి.యూజర్ ఐడీతో లాగిన్ అయి, ఆపై "బేసిక్ సర్వీసెస్" క్రింద "యాడ్ పాలసీ" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు మీ మిగిలిన పాలసీలన్నింటినీ రిజిస్టర్ చేసుకోవచ్చు.దీనివల్ల మీ రిజిస్టర్డ్ పాలసీలు అన్నీ బేసిక్ సర్వీసెస్ యాక్సెస్ చేయగలవు.

జుట్టు రాలడం, చుండ్రు రెండింటికి చెక్ పెట్టే ముల్తానీ మట్టి.. ఎలా వాడాలంటే?