కెనడా వెళ్ళే భారతీయ విద్యార్ధులకు అలెర్ట్...ఈ రూల్స్ తెలుసుకున్నారా...!!!

భారత్ నుంచీ విదేశాలకు ఎంతో మంది విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం వలసలు వెళ్తుంటారు.

ముఖ్యంగా అమెరికాకు ఈ వలసలు అత్యధికంగా ఉన్నా క్రమ క్రమంగా భారతీయ విద్యార్ధుల చూపు కెనడా వైపు ఆకర్షించబడుతోంది.

కరోనా తరువాత నుంచీ ఈ పరిస్థితులలో మార్పులు వచ్చాయి.దాంతో ఏడాది నుంచీ కెనడా వలసలు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది.

గత ఏడాది కంటే కూడా ఈ విద్యా సంవత్సరం వలసలు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని కీలక సూచనలు చేసింది.

ఉన్నత విద్యను అభ్యసించడానికి కెనడా వెళ్ళే విద్యార్ధులు అక్కడ తప్పనిసరిగా పార్ట్ టైం ఉద్యోగాలలో చేరుతారు.

తమ పాకెట్ మనీ కోసం కెనడాలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

ఈ నేపద్యంలోనే కెనడా ప్రభుత్వం ఉద్యోగాలు చేసుకునే విద్యార్ధులను ఉద్దేశించి కొన్ని సూచనలు చేసింది.

కెనడాలో త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోందని, భారీ సంఖ్యలో విద్యార్ధులు కెనడాకు రాబోతున్నారు వారు కెనడా వచ్చిన వెంటనే వారి వారి వర్సిటీలలో చేరిన తరువాత మాత్రమే ఉద్యోగాలలో చేరాలని సూచించింది కెనడా ప్రభుత్వం.

"""/"/ కాలేజీలలో కోరు మొదలైన తరువాత మాత్రమే ఉద్యోగాలలో చేరాలని కెనడా నిభంధనలను అనుసరించి ఉద్యోగాలు చేయాలని సూచించింది.

కోర్సు మొదలవ్వకుండా ఎలాంటి పరిస్థితులలో కూడా ఉద్యోగాలలో చేరవద్దని తెలిపింది.అలాగే కెనడాలోకి ప్రవేశించిన వెంటనే బోర్డర్ సర్వీస్ అధికారితో తమతో తెచ్చుకున్న డాక్యుమెంట్స్ ను తనిఖీ చేయించుకోవాలని తెలిపింది.

ఒక వేళ అనుకున్న కాలపరిమితి కంటే ఆలస్యంగా కేనదాలోకి వస్తే అందుకు కాలేజీలు అనుమతులు ఇస్తే అందుకు సంభదించిన డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా విద్యార్ధులు చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

ఫాదర్స్ డే నాడు వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్..!!