ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలెర్ట్...!

ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కొన్ని కాల్స్ (phone Calls) రికార్డ్ చేయాలని అనుకుంటారు.

అందుకొరకు థర్డ్ పార్టీ కి సంబంధించిన కాల్ రికార్డింగ్ యాప్స్ ని వాడుతున్నారు.

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రైవసీ కి సంబంధించి గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది.యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని.

అందుకే థర్డ్ పార్టీకి సంబంధించిన కాల్ రికార్డింగ్ యాప్స్​ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ నిర్ణయించింది.

కాల్ రికార్డింగ్స్ ద్వారా కొన్ని సంస్థలకు సంబంధించిన కీలకు విషయాలు బయటకు వస్తున్నాయని దీని ద్వారా ఆయా సంస్థలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని గూగుల్ పేర్కొంది.

మే 11 నుంచి గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నిర్ణయం అమల్లోకి రావడం ద్వారా ఇక మనం ఫోన్‌లో వాయిస్ కాల్​ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు.

మొదటి నుండి కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ కు, యాప్స్ కు గూగుల్ వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చింది.

గూగుల్ తన సొంత డెయిలర్ అప్లికేషన్ లో సైతం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంటే ఒక శబ్దాన్ని పుష్ వచ్చేలా తయారుచేసింది.

ఆ తర్వాత రికార్డింగ్ ఫీచర్ ను తన డెయిలర్ లో నుండి పూర్తిగా తొలిగించింది.

ఇదిలా ఉండగా.అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నదని గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది.

అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్​ను తొలగించేందుకు సిద్ధమైంది.గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సపోర్ట్ చేస్తుండగా.

కొందరు కాల్ రికార్డింగ్ అవసరమని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

అమెరికాలో నేపాలీ యువతి దారుణహత్య .. పోలీసుల అదుపులో భారత సంతతి వ్యక్తి