బహుపరాక్: ముక్కుముఖం తెలియనివారు షేర్ చేస్తున్న లింక్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు!

రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ ఎన్నో ఉపయోగాలతో పాటు మరెన్నో అపాయాలను తెచ్చిపెడుతోంది.ముఖ్యంగా నేడు సైబర్‌ నేరగాళ్లు పెచ్చుమీరి వ్యవహరిస్తున్నారు.

ఈజీగా డబ్బులు సంపాదించాలనే నెపంతో అడ్డగోలుగా డబ్బులు దోచేస్తున్నారు.దానికి సోషల్ మీడియాలను విరివిగా వాడుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో మనం అప్రమత్తంగా ఉండటం తప్ప, చేసేదేమి లేదు.దీనికి వారు రకరకాల కుయుక్తులు పన్నుతూ వుంటారు.

ఈ నేపథ్యంలో స్పేస్‌లో గిఫ్ట్స్ గెలుచుకునే మెసేజెస్ లేదా అనుమానాస్పద లింక్స్ విషయంలో జాగ్రత్త అవసరమని సైబర్ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

అయితే నేటి తరం ఇలాంటి విషయాలను పెడచెవిన పెట్టడం వలన తరచూ మోసపోతూ పెద్ద మొత్తంలో డబ్బును సమర్పించుకుంటున్నారు.

సైబర్ నేరగాళ్లు దానికి అనేక పద్ధతులు అనుసరిస్తున్నారు.సైబర్ క్రిమినల్స్ స్కామింగ్‌కు పాల్పడే పద్ధతుల్లో 'పేమెంట్ లింక్ స్కామ్' ఒకటి.

అలాగే లింక్స్, SMS ఫార్వార్డింగ్ అనేది రెండవ పద్ధతి.ఓ యాప్ ద్వారా మొబైల్ మాల్‌వేర్‌ను ఆటో-ఇన్‌స్టాల్ చేయడం కూడా మోసగాళ్లు ఉపయోగిస్తున్న ఈ విధానంలో భాగమే.

ఈ రెండు స్కామ్స్‌లోనూ మోసగాళ్లు బ్యాంక్ అధికారి లేదా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వలె పరిచయాన్ని ఏర్పరచుకుని టెక్ట్స్ మెసేజ్, సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్ ద్వారా మనల్ని సంప్రదిస్తుంటారు.

"""/"/ సాధారణంగా ఇంటర్నెట్ లింక్స్ ఓపెన్ చేయడం ద్వారా లేదా వ్యక్తిగత సమాచారంతో ప్రతిస్పందించడం ద్వారా వివరాలను నిర్ధారించమని బాధితుడిని అడగడం ద్వారా తమ పని సులువు చేసుకుంటారు.

ఈ 'పెయిడ్ లింక్ స్కామ్' వల్ల సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం నష్టపోతున్నారు.

క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా వంటి ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌లో పనిచేసిన టీవీ యాక్ట్రెస్ అమన్ సంధు కూడా 'పేమెంట్ లింక్ ఫ్రాడ్'లో ఇటీవలే తన డబ్బు కోల్పోయిన విషయం తెలిసిందే.

కాబట్టి అపరిచితులు మీకు పంపించినటువంటి ఎలాంటి లింక్స్ అయినా ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం.

,.