అంత మందిని ఎందుకు కన్నావ్… తారకరత్న భార్య పై నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు!

దివంగత నటుడు తారకరత్న ( Tarakaratna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నందమూరి హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన తారకరత్న ఇండస్ట్రీలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.

అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.తారకరత్న మరణించిన తర్వాత తన భార్య అలేఖ్య రెడ్డి ( Alekhya Redd Y)తరచూ సోషల్ మీడియా వేదికగా తన భర్త తన పిల్లలకు సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా అలేఖ్య రెడ్డి సమాధానాలు చెబుతూ ఉంటారు.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా అలేఖ్య రెడ్డి గురించి ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తారకరత్న అలేఖ్య దంపతులకు ముగ్గురు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే.మొదట అమ్మాయి జన్మించగా తదుపరి ఇద్దరు కవల పిల్లలు ( Twin S) జన్మించారు.

దీంతో ఒక నెటిజన్ ఇంతమంది పిల్లల్ని( Kids ) కనడం ఎందుకు అంటూ కామెంట్ చేశారు ఇలాంటి కామెంట్ ఎవరైనా చేస్తే కచ్చితంగా వారిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

కానీ అలేఖ్య రెడ్డి మాత్రం ఆ నేటిజన్ ప్రశ్నకు తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.

"""/" / ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి స్పందిస్తూ.ఎవరి పిల్లలైనా సరే వారి బ్యాగ్రౌండ్ చూడకుండా పిల్లలను సమానంగా పెంచాలని తెలిపారు.

పిల్లల్ని ప్రేమిస్తూ వారికి ప్రేమను పంచాలి కాని ద్వేషం పంచకూడదని తెలిపారు.వారికి హాని చేయాలని అనుకోకూడదు.

నెగెటివిటీ, ద్వేషం కంటే.అర్థం చేసుకునే గుణం, ప్రేమను పంచే తత్వాన్ని ఈ సమాజంలో పెంచాలి.

మనమంతా కలిసి పాజిటివ్గా ఆలోచిస్తే అద్భుతమైన సమాజాన్ని నిర్మించవచ్చు దయచేసి అందరూ ప్రేమను పంచండి అంటూ ఈ సందర్భంగా అలేఖ్య చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

 .

నాగార్జున వందోవ సినిమా కోసం తమిళ్ స్టార్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టాడా..?