Alekhya Reddy : భర్త పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన అలేఖ్యారెడ్డి.. ఫొటోకు ముద్దు పెడుతూ?
TeluguStop.com
టాలీవుడ్ నందమూరి హీరో తారకరత్న( Hero Tarakaratna ) గురించి మనందరికీ తెలిసిందే.
తారకరత్న గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే.ఆయన చనిపోయి ఏడాది కూడా పూర్తి అయింది.
కానీ ఇప్పటికీ ఆయన చనిపోయారు అంటే నమ్మ సక్యంగా లేదు.తారకరత్న భౌతికంగా దూరం అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
తారకరత్న గుండెపోటుతో గత ఏడాది ఫిబ్రవరి 18న మరణించారు.నారా లోకేష్ యువగళం పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన విషయం తెలిసిందే.
"""/" /
అలా దాదాపుగా 22 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి మరణించారు.
తారకరత్న మరణించి ఈనెల 18కి ఏడాది గడించింది.ఇక ఇవ్వాళ ఆయన జయంతి.
41వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, శ్రేయోభిలాషులు నివాళి అర్పిస్తున్నారు.ఇక భర్తకు అలేఖ్య రెడ్డి ( Alekhya Reddy )నివాళి అర్పించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది.
భర్త జయంతి సందర్భంగా పూల బొకేను తీసుకొచ్చి నివాళి అర్పించింది.భర్తను ఫొటోలో చూసి మురిసిపోయింది.
గుండెల నిండా బాధతో అలేఖ్య రెడ్డి భర్త జయంతి సందర్భంగా నివాళి అర్పించింది.
ఇక ఫొటోలో ఉన్న తారకరత్నకు ముద్దుపెట్టి తన ప్రేమను చాటుకుంది.చిత్రపటాన్ని గుండెకు గట్టిగా హత్తుకుంది.
"""/" /
భర్త లేడనే బాధ తన హృదయాన్ని తొలిచేస్తున్నా చిరునవ్వుతో జయంతి సందర్భంగా నివాళి అర్పించింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అలేఖ్య పరిస్థితి కన్నీళ్లు తెప్పించేలా ఉండటంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఎమోషనల్ గా కామెంట్లు చేస్తూనే అలేఖ్య రెడ్డికి ధైర్యం చెబుతున్నారు.
ఫ్లాపైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారా?