కరోనాను మించిన కేసులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అనారోగ్యం పాలు అయ్యారు.

కాగా వేలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.ఈ వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా వదలడం లేదు.

అయితే కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి.ఈ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని ప్రభుత్వం భావించింది.

అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్ కంటే కూడా మరో మహమ్మారి ఇప్పుడు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది.

లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు పూర్తిగా మూసేశారు.దీంతో మందు బాబులు మతిస్థిమితం కోల్పోయిన వారిలా వింతగా ప్రవర్తిస్తున్నారు.

కాగా వారిని కంట్రోల్ చేయడం కుటుంబ సభ్యుల వల్ల కాకపోవడంతో వారిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తీసుకొస్తున్నారు.

దీంతో అక్కడ గతకొద్ది రోజుల్లో ఏకంగా 300కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇది తెలుగు రాష్ట్రాల్లోని కరోనా కేసులకంటే కూడా ఎక్కువ.ఇలా మద్యం అమ్మకాలు లేకపోవడంతో ప్రజలు వింతగా ప్రవర్తించడంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వాధికారులు చేతులెత్తేశారు.

24 గంటలు నాన్‌స్టాప్ డెలివరీ బాయ్‌గా పని చేసిన యూట్యూబర్‌.. చివరికి..??