Alcholic Ice Cream : వైరల్ వీడియో: మందుబాబులు మీకోసమే.. మాంచి కిక్ ఇచ్చే ఐస్ క్రీమ్..!

సోషల్ మీడియా( Social Media ) పుణ్యమా అంటూ ప్రతిరోజు అనేక రకాల ఫుడ్ వీడియోలు మనం రోజు చూస్తూనే ఉన్నాము.

ఇందులో కొన్ని వీడియోలు చూస్తే వెంటనే వాటిని తిని ఆస్వాదించాలని భావిస్తాం.మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం మనం తినే తిండి పైనే విరక్తి చెందేలా భావాన్ని కలిగిస్తాయి.

నిజానికి ప్రజలకి రోజురోజుకీ కొత్త రకాల రుచులను ఆస్వాదించాలని భావిస్తున్నారు.ఇందుకోసమే జనాలకు వారి వింత టెస్టులను ట్రై చేసేందుకు కొన్ని కాంబినేషన్స్ చేసేస్తున్నారు రెస్టారెంట్ ఓనర్స్.

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే. """/" / ఈ వీడియోలో మనకి మందుతో తయారుచేసిన ఐస్ క్రీమ్( Ice Cream ) కనబడుతుంది.

ఈ విషయం వింటేనే మందుబాబులకు ఓ మంచి కిక్ ఎక్కుతుంది.వెంటనే కిక్ ఎక్కుతుంటే మరి తింటే పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

ఇక ఈ మందు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తున్నారో ఓసారి చూద్దామా.

మామూలుగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఐస్ క్రీమ్ ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.

"""/" / అలాంటిది మరి ఇప్పుడు మందుతో తయారుచేసిన ఐస్ క్రీమ్ అంటే.

ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ ని తయారు చేయడానికి సిద్ధమవుతాడు.

ముందుగా రోలింగ్ ఐస్ క్రీమ్ మేకింగ్ మిషన్ లో మందు వేసిన తర్వాత అందులో వెనీలా ఐస్ క్రీమ్ ని జోడిస్తాడు.

అలా వేసిన ఐస్ క్రీం ని రోల్స్ గా మార్చేస్తుంది మిషన్.ఆ తర్వాత ఐస్ క్రీమ్ రోల్స్( Ice Cream Rolls ) పైన కూడా చాక్లెట్ సాస్ ఇంకా అనేక రకాల పదార్థాలను కలిపి ఈ కొత్త రకం ఐస్ క్రీము ను తయారు చేసేస్తున్నారు.

నిజానికి ఈ ఐస్ క్రీమ్ చూస్తే చాలా కలర్ ఫుల్ గా బాగానే కనబడుతున్న కానీ.

, తింటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు.ఈ వీడియోలో తయారుచేసిన ఐస్ క్రీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేకమంది ఇలాంటి ఐస్ క్రీమ్ ని ఎప్పుడప్పుడు టేస్ట్ చేద్దామా అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మీరు కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నారో లేదో కామెంట్ రూపంలో తెలపండి.

స్వయంభు సినిమా ఎలా ఉండబోతుంది..? నిఖిల్ సక్సెస్ కొడుతాడా..?