ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ ఆదరణ చూసి ఆశ్చర్యపోయిన అల్బనీస్‌!

అవును, మోడీ( PM Modi ) ఆదరణ చూసి ప్రపంచం విస్తు పోతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద 'టాలెంట్‌ ఫ్యాక్టరీ' భారత్‌లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా( Australia ) వేదికగా ఎలుగెత్తి మాట్లాడారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సిడ్నీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఆస్ట్రేలియాతో బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను చెప్పారు.

ఇరు దేశాలను అనుసంధానిస్తోన్న '3C'ల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. """/" / ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని మోదీపై ప్రశంసల జల్లులు కురిపించారు.

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ."కొన్ని తరాలుగా క్రికెట్‌ అనేది మన ఇరు దేశాలను కలుపుతోంది.

ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, యోగా, ప్రవాసభారతీయ కమ్యూనిటీ అనేవి మన బంధాన్ని బలోపేతం చేయడంలో ఇంకా దోహదం చేస్తున్నాయి.

అవును, మన బంధాన్ని నిర్వచించడానికి '3C'లు ముఖ్యమైనవి.అవి.

కామన్వెల్త్‌, క్రికెట్‌, కర్రీ" అంటూ చెప్పుకొచ్చారు. """/" / ఇక మోడీ మాట్లాడుతూ.

"అవి మాత్రమే కాకుండా 3Dలు అంటే.డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ, 3Eలు.

ఎనర్జీ, ఎకనామీ, ఎడ్యుకేషన్‌ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.వాస్తవంలో వీటన్నింటినీ దాటుకొని ఆస్ట్రేలియాతో భారత్ బంధం చాలా బలంగా బలపడింది.

అందుకు కారణం పరస్పర నమ్మకమే.ఇక్కడి ప్రజలు విశాల హృదయులు, శాంతి స్వభావులు.

భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో విరివిగా వినిపిస్తాయి.నేను మళ్లీ వస్తానని 2014లోనే మీకు వాగ్దానం చేశాను.

ఇపుడు మళ్లీ వచ్చి నా వాగ్దానం నెరవేర్చుకున్నా" అని మోదీ అన్నారు.కాగా మోడీ రాకతో అక్కడ వెల్లువెత్తిన హర్షద్వానాలకు అక్కడి ప్రధాని అల్బనీస్‌( Albanese ) నివ్వెరబోయారు.

వీడియో: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బస్సు.. పెట్రోల్ బంక్ ఉద్యోగిని తొక్కేసింది..?