అలాస్కా ఎయిర్‌లైన్స్ ప్రమాదం: యూఎస్ ఎఫ్ఏఏ కీలక నిర్ణయం.. అన్ని బోయింగ్ 737-9 మాక్స్ విమానాల నిలిపివేత

ఇటీవల అలస్కాలో( Alaska ) జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను( Boeing 737 Max Planes ) తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.

టేకాఫ్ అయిన తర్వాత బోయింగ్ విమానం లోపల జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఎఫ్ఏఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తదుపరి నోటీసు వచ్చే వరకు బోయింగ్ 737 విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.

మంగళవారం బోయింగ్ సీఈవో డేవ్ కాల్హౌన్ .( Boeing CEO Dave Calhoun ) అలస్కా ఎయిర్‌లైన్స్ ప్రమాదంపై స్పందించారు.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని .మా తప్పును అంగీకరిస్తున్నామని డేవ్ తెలిపారు.

"""/" / కాగా.మంగళవారం బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాన్ని తిరిగి ఆపరేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.

విమాన తనిఖీలు చేపట్టే విమానయాన సంస్థలకు మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వం బోయింగ్‌ను ఆదేశించింది.

ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ మైక్ విటేకర్( FAA Administrator Mike Whitaker ) మాట్లాడుతూ.

కొన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు గాల్లోకి లేచేముందు తనిఖీలు తప్పనిసరి అన్నారు.

అలస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282కి సంబంధించి ఎన్‌టీఎస్‌బీ పరిశోధనలో ప్రభుత్వపరమైన సాయం వుంటుందని మైక్ స్పష్టం చేశారు.

"""/" / ఇకపోతే .ఈ నెల 5న 171 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు( Alaska Airlines ) చెందిన బోయింగ్ 737 9 మ్యాక్స్ విమానం డోర్ గాల్లోనే ఊడి ఎగిరిపోయింది.

ఈ ఘటనతో ప్రయాణీకులంతా ప్రాణభయంతో వణికిపోయారు.ఈ ఫ్లైట్ పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియోకు బయల్దేరింది.

అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎమర్జెన్సీ డోర్ ఊడి ఎగిరిపోయింది.గాలి ఒత్తిడి కారణంగా ఆ డోర్ పక్కనే వున్న సీటు కూడా గాల్లోకి ఎగిరిపోయింది.

ఆ వెంటనే ఆక్సిజన్ మాస్కులు వేలాడుతూ బయటకు వచ్చాయి.పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి పోర్ట్ ల్యాండ్‌కు తరలించాడు.

అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కానీ బోయింగ్ 737 9 మ్యాక్స్ విమానాల భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

పుష్ప ది రూల్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. జానీకి బదులుగా ఆ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ దక్కిందా?