అలస్కా తీరంలో బోటు మునక: ఐదుగురు గల్లంతు

అలస్కాన్ ద్వీపకల్ప తీరంలో మంగళవారం బోటు మునిగిపోయిన ఘటనలో ఐదుగురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది.

యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపిన వివరాల ప్రకారం అలస్కా గల్ఫ్‌‌లోని సుత్విక్ ద్వీపం సమీపంలో స్కాండిస్ రోజ్ అనే ఫిషింగ్ బోటు మంగళవారం అర్థరాత్రి మునిగిపోయినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Alaska-crab-boat-sinks-బోటు-మునక-1!--jpg"/దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, 15 నుంచి 20 అడుగుల ఎత్తులో వచ్చిన బలమైన అలలు, వెలుతురు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా కోస్ట్ గార్డ్ తెలిపింది.

ప్రమాద విషయం తెలియగానే తాము జైహాక్ హెలికాఫ్టర్, హెర్క్యులస్ విమానాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని రక్షించినట్లు కోస్ట్‌ గార్డ్ వెల్లడించింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Alaska-crab-boat-sinks-బోటు-మునక!--jpg"/ఉనలస్కాలోని డచ్ హార్బర్ కేంద్రంగా స్కాండిస్ రోజ్ పనిచేస్తోంది.ఇది బోటు మునిగిన ప్రాంతానికి సుమారు 400 మైళ్లదూరంలో ఉంది.

క్రాబింగ్ పరిశ్రమ చారిత్రాత్మకంగా ఎంతో ప్రమాదకరమైనది.వేట సమయంలో క్రూ సిబ్బంది ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.

2017లో వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఓ క్రాబింగ్ ఫిష్ సెయింట్ పాల్ తీరం సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో ఆరుగురు సిబ్బంది జలసమాధి అయ్యారు.

కాగా తాజా ప్రమాదంలో రక్షించబడిన ఇద్దరిని కోడియాక్ ఆసుపత్రికి తరలించినట్లు కోస్ట్ గార్డ్ 17వ జిల్లా కమాండ్ సెంటర్ డ్యూటీ ఆఫీసర్ లెఫ్టెనెంట్ వేడ్ ఆర్నాల్డ్ మీడియాకు తెలిపారు.

అమెరికాలో ఘోర ప్రమాదం : పల్టీలు కొడుతూ, చెట్టుపై ఇరుక్కుపోయిన కారు .. ముగ్గురు భారతీయుల దుర్మరణం