అల వైకుంఠపురములో అర్జున్ రెడ్డి.. పార్ట్ 2!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు.

బన్నీ స్టైలిష్ యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, థమన్ అదిరిపోయే మ్యూజిక్ కలగలిసి ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాయి.

ఇక ఈ సినిమాను ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమా తన తడాఖా చూపిస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సీన్‌లో సుశాంత్‌కు సంబంధించిన సీక్రెట్‌ను బన్నీ తెలుసుకుని, అతడికి ఆటపట్టించడం మనకు కనిపిస్తుంది.

ఈ సీన్‌లో అర్జున్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడంతో ఈ సీన్ చాలా ఆసక్తికరంగా మారింది.

ఈ సన్నివేశాన్ని సినిమా నుండి ఎందుకు తొలగించారో అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తు్న్నారు.

మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్ ప్రస్తుం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సీన్‌ను మీరు ఓసారి చూసేయండి.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!