అల వైకుంఠపురములో హిందీ రిలీజ్ క్యాన్సల్.. ఎందుకంటే..!
TeluguStop.com
పుష్ప సూపర్ హిట్ ఊపులో ఉన్న హిందీ ఆడియెన్స్ కి వెంటనే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా డబ్ చేసి చూపించాలని అనుకున్నారు గోల్డ్ మైన్స్ టెలి ఫిలిమ్స్ వారు.
జనవరి 26న అల వైకుంఠపురములో సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ని రిలీజ్ ప్లాన్ చేశారు.
అయితే ఇదే సినిమాను బాలీవుడ్ లో షెహజాదా గా రీమేక్ చేస్తున్నారు.కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.
అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిందీ వర్షన్ అక్కడ రిలీజైతే షెహజాదా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని భావించి అల వైకుంఠపురములో హిందీ రిలీజ్ ఆపేశారు.
దీని కోసం గోల్డ్ మైన్స్ వారితో చర్చించుకున్నారని తెలుస్తుంది.గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ వారు అల వైకుంఠపురములో రైట్స్ కోసం 8 కోట్ల దాకా ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది.
సో సినిమా రిలీజ్ చేయకుండానే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ద్వారా కూడా వీరు లాభం పొందారు.
పుష్ప సినిమాని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేసింది వీళ్లే.మొత్తానికి అల్లు అర్జున్ సినిమాలతో గోల్డ్ మైన్స్ టెలి ఫిలింస్ వారు బాగా లాభ పడుతున్నట్టు తెలుస్తుంది.
ఐదు రోజుల్లో అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుంది అనుకున్న పుష్ప రాజ్ ఫ్యాన్స్ కి చివరి నిమిషంలో షాక్ తగిలింది.