మరో 15 కలిపి 100 కోట్లు వేసుకోపోయారా?

అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో అల్లు అర్జున్‌ హీరోగా నటించగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్‌ మరియు రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమాకు విడుదలైన మొదటి రోజే హిట్‌ టాక్‌ వచ్చింది.దాంతో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ ప్రచారం చేస్తున్నారు.

"""/"/మామూలుగా అయితే సినిమా కలెక్షన్స్‌ను ప్రమోషన్స్‌ కోసం వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

కొందరు నిర్మాతలు కాస్త ఎక్కువ చెప్పి మరీ కలెక్షన్స్‌ పబ్లిసిటీ చేస్తారు.కాని అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం మరీ దారుణంగా ఏకంగా 85 కోట్లు అంటూ ప్రచారం చేస్తునన్నారు.

మొదటి రోజు ఏకంగా 85 కోట్ల వసూళ్లు అంటే మామూలు విషయం కాదు.

అది బాలీవుడ్‌ సినిమాలకు సైతం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.అలాంటిది మొదటి రోజు అంతటి వసూళ్లు ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు.

"""/"/పబ్లిసిటీ కోసం మరీ ఇంతటి ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని మీడియాలో పబ్లిసిటీ కార్యక్రమాలు చేసేందుకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని, ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానుకుని ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటూ జనాలు చిత్ర యూనిట్‌ సభ్యులకు సూచిస్తున్నారు.

50 కోట్ల లోపు కూడా వచ్చి ఉంటాయో లేదో అనే అనుమానంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు మరో 15 కోట్లు కలిపి 100 కోట్లు వచ్చాయంటే బాగుంటుంది కదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!