షెహజాద్ కు అల వైకుంఠపురంలో డబ్బింగ్ దెబ్బ..
TeluguStop.com
అల్లు అర్జున్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.ఈ సినిమా తెలుగులో అద్భుత విజయాన్ని అందుకుంది.
మంచి వసూళ్లను సాధించింది.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ గానూ మంచి సక్సెస్ అయ్యింది.
తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ హీరోగా షెహజాద్ పేరుతో రీమేక్ అవుతుంది.
ఈ సినిమాపై ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటె బన్నీ నటించిన తాజా మూవీ పుష్ప సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో తన సినిమా హిందీలోకి రీమేక్ అవడం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది.అయితే బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఈ సినిమా రైట్స్ తీసుకుని డబ్ చేసి హిందీలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
దీంతో షెహజాద్ టీం.డబ్బింగ్ వర్షన్ విడుదలను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తోంది.
మనీషా మాత్రం తప్పకుండా విడుదల చేసి తీరుతానంటున్నాడు.ఒకవేళ అల వైకుంఠపురంలో డబ్బింగ్ మూవీగా హిందీలో రిలీజ్ అయితే తాను షెహజాద్ నుంచి తప్పుకుంటానని చెప్తున్నాడు కార్తీక్.
ఎవరు ఎమనుకున్నా తనకు అవసరం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ నిర్మాత మనీష్ షా.
ఈ సినిమాను హిందీలో థియేటర్స్ లో రిలీజ్ చేయకపోయినా.ఫిబ్రవరి 6న ఈ సినిమాను తన సొంత చానెల్ ఢించక్ టీవీలో టెలీకాస్ట్ చేస్తానని తెగేసి చెప్తున్నాడు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలా వచ్చినా షెహజాద్ సినిమాకు పెద్ద ఇబ్బంది అవుతుంది.
ఈ రీమేక్ సినిమాలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఒకవేళ కార్తీక్ ఈ సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతలకు ఇబ్బంది తప్పదు. """/"/
ఓవైపు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంటే.
అసలు డబ్బింగ్ రైట్స్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి వాటి మూలంగా ఒక్కోసారి హీరో కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది.
హిందీలో కార్తీక్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు.
ఏదైనా తేడా కొడితే తన ఇమేజ్ కే పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది.
తండ్రిగా ప్రమోట్ అయిన దగ్గుబాటి హీరో… పండంటి ఆడబిడ్డకు జన్మ!