అయ్యో టీచర్ పై మనసు పారేసుకున్న పూజా పాప... !
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
తాజాగా పూజా హెగ్డే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి అల వైకుంఠపురంలో అనే చిత్రంలో నటించింది.
ఈ చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటించగా మురళి శర్మ సీనియర్ నటుడు జయరామ్, సీనియర్ హీరోయిన్ టబు, సునీల్, అక్కినేని హీరో సుశాంత్, నవదీప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా పూజా హెగ్డే ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూ లో పాల్గొంది.
ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవిత లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంది.
తను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక టీచర్ పై క్రష్ ఉండేదని చెప్పుకొచ్చారు.
కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిపోయింది అని అన్నారు.అంతేగాక అతనికి అమితాబచ్చన్ మరియు మాధురి దీక్షిత్ అంటే చాలా అభిమానమని అన్నారు.
ఇక ఆహార విషయానికొస్తే యంగ్ రెబెల్ స్టార్ వండిన అటువంటి మటన్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని అంతేగాక ప్రభాస్ కూడా తనలాగే మంచి ఫూడీ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
"""/"/అయితే ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి జాన్ అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?