వైకుంఠపురంలో ఇంకా సందడే సందడి

సంక్రాంతి సినిమాలు వచ్చి నెల రోజులు కావస్తుంది.ఈమద్య కాలంలో సినిమాలు రెండు మూడు వారాల్లోనే కనుమరుగవుతున్నాయి.

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత అన్ని కూడా కనిపించకుండా పోయాయి.

అయితే నెల రోజులు కావస్తున్నా కూడా అల వైకుంఠపురంలో చిత్రం మాత్రం ఇంకా సందడి చేస్తూనే ఉంది.

బాక్సాఫీస్‌ సందడి ఉన్నా లేకున్నా కూడా మీడియాలో మాత్రం వైకుంఠపురం సందడి కనిపిస్తూనే ఉంది.

"""/"/అల వైకుంఠపురంలో సక్సెస్‌ మీట్‌.థ్యాంక్స్‌ మీట్‌.

ఆల్‌ టైం హిట్‌ మీట్‌.ఇండస్ట్రీ హిట్‌ ప్రెస్‌ మీట్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు పదే పదే ప్రెస్‌ మీట్‌లు, ఫ్యాన్స్‌ మీట్‌లు పెడుతున్నారు.

నిన్న ఇండస్ట్రీ వారికి మరియు తెలుగు మీడియా వారికి బన్నీ అండ్‌ టీం పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వడం జరిగింది.

ఇక బన్నీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఇంకా పార్టీ మూడ్‌లోనే ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

"""/"/మొత్తానికి అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రం మీడియాలో రచ్చ రచ్చ చేస్తూనే ఉంది.

ఈ జోరు మరో వారం రెండు వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న అల వైకుంఠపురంలో ప్రేక్షకుల అంచనాలను నిజం చేసింది.దాదాపుగా 250 కోట్ల గ్రాస్‌ వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్లుగా తెలుస్తోంది.

పలు ఏరియాల్లో బాహుబలి 1 రికార్డును బ్రేక్‌ చేయడంతో బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబోకు భారీ హ్యాట్రిక్‌ దక్కింది.

కొత్త టాలెంట్ చూపించి ఆశ్చర్యపరిచిన యాక్టర్స్.. వాళ్లెవరంటే..?