అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి 2 కూడా బాగానే అలరిస్తోందిగా....

ఈ ఏడాదిలో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తారీఖున విడుదలైన టువంటి అల వైకుంఠ పురంబులో చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది.

అలాగే సీనియర్ నటుడు విజయ్ రామ్, టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, సునీల్, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల చిత్రీకరణ సమయంలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు.

తాజాగా ఓ సన్నివేశాన్ని యూట్యూబ్ లో విడుదల చేయగా ఈ వీడియో కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ వీడియోలో హీరో సుశాంత్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సిగరెట్ మరియు మద్యం తాగే ఈ విధంగా చేసినటువంటి సన్నివేశం నన్ను బాగానే ఆకట్టుకుంటుంది.

అయితే ఇందులో చివర్లో అల్లు అర్జున్ కార్లో వెళ్తూ సుశాంత్ బస్సు కోసం పరిగెడుతున్నటువంటి సన్నివేశం కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

అయితే ఈ తొలగించిన వీడియో యూట్యూబ్ లో విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా రెండు మిలియన్ల పై వ్యూస్ వచ్చాయి.

అయితే ఈచిత్రం కూడా వసూళ్ల పరంగా ఇతరదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది.దీంతో అల్లు అర్జున్ ఈ ఏడాది సాలిడ్ హిట్ తో తన ఖాతా తెరిచాడు.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో బన్నీ సరసన  రష్మిక మందన్న నటిస్తోంది.

కుక్కను బ్రిడ్జి దాటించిన వ్యక్తి.. దాని రియాక్షన్ చూస్తే ఫిదా..??