సంక్రాంతికి మరో నెల రోజుల్లో రాబోతుంది.సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మరియు కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఎంత మంచి వాడవురా సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.కాని మహేష్ మరియు బన్నీ సినిమాలు మాత్రమే భారీ అంచనాలు కలిగి ఉన్నాయి.
ఈ రెండు సినిమాలను ఒకే రోజున విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. """/"/ఈ రెండు సినిమాల నిర్మాతలు మరియు హీరోలు జనవరి 12న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
కాని సినీ ప్రముఖులు కొందరు మద్య వర్తిత్వం చేయడంతో ఈ బాక్సాఫీస్ పోరు తప్పింది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి సినిమాలు రెండు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
సరిలేరు నీకెవ్వరు అదే రోజున రానుండగా అల వైకుంఠపురంలో మాత్రం మారింది. """/"/అల వైకుంఠ పురంలో సినిమాను రెండు రోజుల ముందే అంటే జనవరి 10న లేదంటే రెండు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
జనవరి 14 అయితే సంక్రాంతి సీజన్ అంతా అయిపోతుంది.అందుకే జనవరి 10న విడుదల చేయడం బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మరి ఈ రెండు డేట్లలో అల వైకుంఠ పురంలో ఏ తేదీన రాబోతుందో చూడాలి.
దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్… ఎంతో ప్రత్యేకం అంటూ!