అల వైకుంఠపురంలో సందడికి బ్రేక్ పడినట్లేనా?
TeluguStop.com
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం జోరు ముందు సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలవలేక పోయిందని చెప్పుకోక తప్పదు.
రెండు వారాల పాటు అల వైకుంఠపురంలో సందడి జోరుగా కొనసాగింది.దాదాపుగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బన్నీ కెరీర్‌లోనే ఈ చిత్రం టాప్ పొజీషన్‌లో నిలిచింది.
బన్నీ కెరీర్‌లోనే కాకుండా ఏకంగా టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బన్నీని టాప్ స్టార్‌గా నిలబెట్టిన అల వైకుంఠపురంలో చిత్రం కలెక్షన్స్‌కు డిస్కోరాజా రవితేజ బ్రేక్ వస్తాడని అంతా అనుకున్నారు.
కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిస్కోరాజా చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా కూడా ఓపెనింగ్స్ మాత్రం అంతగా లేవని సమాచారం అందుతోంది.
ఎందుకంటే రవితేజ గత చిత్రాలకు వచ్చిన స్పందన.ఆ సినిమాల మాదిరిగానే ఈ సినిమాలు ఉంటాయేమో అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు డిస్కోరాజాను మొదట పట్టించుకోలేదు.
"""/"/సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న కారణంగా చిత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే కనుక నిజం అయితే అల వైకుంఠపురంలో జోరుకు బ్రేక్ పడ్డట్లే అంటున్నారు.
అయితే రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
అప్పుడు మరోసారి అల వైకుంఠపురంలో చిత్రంకు ప్రేక్షకుల నుండి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా కలెక్షన్స్ డౌన్ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?