అల వైకుంఠపురములోని ఆ వైకుంఠపురం ఎవరిదో తెలుసా...?

తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి అల వైకుంఠ పురములో చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది థియేటర్లలో దూసుకుపోతోంది.

ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బన్నీ సరసన పూజా హెగ్డే, నివేత పేతురాజ్, నటించగా అక్కినేని హీరో సుశాంత్, టబు, జయరామ్, సముద్రఖని, సునీల్,  నవ దీప్ వంటివారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే తాజాగా విడుదలైన టువంటి ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.దాదాపుగా ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.

అయితే ఈ చిత్రంలోని వైకుంఠపురం ఇల్లు ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు.ఎంతో  విలాసవంతమైన టువంటి ఇల్లు ప్రముఖ వార్త ఛానల్ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారి ఏకైక కుమార్తె అయినటువంటి రచనా చౌదరిది.

అయితే ఈ చిత్రంలోని పలు ఫైట్ సీన్ లను మరియు ఇతర సీన్లను తెరకెక్కించడం కోసం ఇతర లొకేషన్లను దర్శకుడు వాడుకున్నాడు.

 కానీ వైకుంఠ పురంలో జరిగే టువంటి సీన్ల కోసం మాత్రం ఎటువంటి సెట్లు వేయకుండా నిజమైన ఇంటిలోనే తెరకెక్కించారు.

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం షూటింగ్ కోసం వారి ఇంటిని అడగగా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

"""/"/దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఇలాంటి ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.

అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చూసినట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ అల వైకుంఠ పురంలో చిత్రంలోని వైకుంఠపురం ఇంట్లో జరిగే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాయి.

సింగపూర్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారత్‌కు .. ఎవరీ థర్మన్ షణ్ముగరత్నం?