Actor Al Pacino : 83 ఏళ్ళలో నాలుగో సారి తండ్రైన నటుడు.. 29 ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో డేట్?
TeluguStop.com
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో( Actor Al Pacino ) మనందరికీ తెలిసిందే.
ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.కాగా ఇటీవలే అల్ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగవసారి తండ్రి అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇంతవరకు బాగానే ఉన్నా తనకంటే వయసులో చాలా ఏళ్లు చిన్నదైనా 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఒక బిడ్డకు స్వాగతం పలకడం నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అని చెప్పవచ్చు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దారుణమైన ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా కొందరు సెటైర్స్ కూడా వేశారు. """/" /
జూన్‌లో నూర్ అల్ఫాల్లా( Noor Alfallah ) బిడ్డకు జన్మనివ్వగా రోమన్ పాసినో( Roman Pacino ) అని నామకరణం చేశారు.
తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియా లోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు.
ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు.
నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్‌ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.
ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా కూడా మారింది.ఈ విషయంపై అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.
తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు అల్ పాసినో.
"""/" /
అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది.
మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అయితే అందరినీ షాకింగ్ కీ గురి చేసే విషయం ఏమిటంటే.
అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు.అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు.
ఆ సమయంలో వీరికి ఒక కుమార్తె జన్మించింది.ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు.
వీరికీ కవల పిల్లలు జన్మించారు.ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు.
ఇక అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు.ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి.
కరోనా లాక్ డౌన్ సమయంలో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు.అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు.
వీడియో: స్పెయిన్‌లో జలవిలయం.. వాహనాలు ఎలా కొట్టుకుపోయాయో చూస్తే..