విధిరాతను అధిగమించి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని.. బాలయ్య చేసిన పనికి ఫిదా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాలు( AP SSC Results ) వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షల్లో తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు ఆకుల లావణ్యలక్ష్మి( Akula Lavanya Lakshmi ) 345 మార్కులు సాధించారు.

పదో తరగతిలో 345 మార్కులు సాధించడం మరీ కష్టం కాదనే సంగతి తెలిసిందే.

అయితే ఈ విద్యార్హిని దివ్యాంగురాలు కావడం గమనార్హం.ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం ఇప్పటికే లావణ్య లక్ష్మిని అభినందించారు.

బలంగా నిలబడటం ద్వారా సవాళ్లను అధిగమించడంతో పాటు అడ్డంకులను సైతం జయించి లావణ్య లక్ష్మి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

అయితే లావణ్య లక్ష్మిని స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సైతం అభినందించడం గమనార్హం.

బాలయ్య లావణ్య లక్ష్మితో ఫోన్ లో మాట్లాడారు.బాలయ్య ఫోన్ లో చాలా సంతోషంగా ఉందని చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

"""/" / నీకు 345 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని నీకేమీ లోటు ఉండదని భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది చెల్లెమ్మా అని బాలయ్య కామెంట్లు చేశారు.

నాకు ఫోన్ చేసి అభినందించిన బాలయ్యకు థ్యాంక్స్ అని లావణ్య లక్ష్మి అన్నారు.

లావణ్య లక్ష్మిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. """/" / లావణ్య లక్ష్మి భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయిలో నిలవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సైతం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.లావణ్య లక్ష్మికి కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విద్యార్థిని లావణ్య లక్ష్మి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown