నిర్భయను చంపినోడి తెలివితేటలు చూసి జడ్జికే మతిపోయింది!

నిర్భయను చంపినోడి తెలివితేటలు చూసి జడ్జికే మతిపోయింది!

అతడు చేసిందే ఓ దారుణమైన పని.అలాంటి పని చేసిన వాడిని ఏడేళ్లుగా జైల్లో పెట్టి మేపుతూ మన న్యాయ వ్యవస్థ కాలం వెల్లదీస్తోంది.

నిర్భయను చంపినోడి తెలివితేటలు చూసి జడ్జికే మతిపోయింది!

ఇప్పటికీ ఉరి తీయడానికి వెనుకా ముందు అవుతోంది.ఈలోపు ఏకంగా న్యాయమూర్తికే షాకిచ్చాడు నిర్భయ నిందితుల్లో ఒకడైన అక్షయ్‌సింగ్‌ ఠాకూర్‌.

నిర్భయను చంపినోడి తెలివితేటలు చూసి జడ్జికే మతిపోయింది!

తనకు విధించిన ఉరి శిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ అతడు సుప్రీంకోర్టులో ఓ రీవ్యూ పిటిషన్‌ వేశాడు.

"""/" /సాధారణంగా తమ శిక్షను తగ్గించుకోవడానికి నిందితులు ఏదో ఒక వాదన వినిపిస్తూ ఉంటారు.

తమను తాము అమాయకులమని నిరూపించుకునేందుకు తెగ ప్రయత్నిస్తారు.కానీ ఈ అక్షయ్‌సింగ్‌ మాత్రం మరో అడుగు ముందుకేశాడు.

తాను ఏ తప్పూ చేయలేదని అతను చెప్పడం లేదు.కానీ ఉరిశిక్ష తప్పించుకునేందుకు ఓ కొత్త అంశాన్ని లేవనెత్తి జడ్జికే షాకిచ్చాడు.

"""/" /ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసు కదా.

ఇదే అంశాన్ని తన పిటిషన్‌లో అతడు ప్రస్తావించాడు.ఎలాగూ ఢిల్లీలో కాలుష్యం భారీగా ఉంది.

ఇదొక గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది.ఆ కాలుష్యానికి ఎలాగూ మేము చచ్చిపోతాం.

మళ్లీ ఈ ఉరిశిక్ష అవసరమా అంటూ కాస్త అతి తెలివి ప్రదర్శించాడు.దీనిపై సుప్రీంకోర్టు ఇంకా స్పందించలేదు.

ఒకవేళ అతని రీవ్యూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తే.ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న వినయ్‌శర్మ, పవన్‌కుమార్‌ గుప్తా కూడా మరోసారి పిటిషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అదే జరిగితే వీళ్ల ఉరి మరింత ఆలస్యం కానుంది.దిశ కేసులో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్న వేళ.

నిర్భయ నిందితుల ఉరి ఆలస్యం కావడంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు నిందితులు తమ అతి తెలివితో పిటిషన్లు వేస్తూ శిక్ష అమలును ఆలస్యం చేసే పనిలో ఉండటం నిజంగా విషాదమే.