మరో బయోఫిక్ తో ముందుకొస్తున్న అక్షయ్.. కొత్త సినిమా పాత రికార్డులు బద్దలు కొట్టేనా?

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో.అక్షయ్ కుమార్.

తను ఏ సినిమా చేసినా.ఓ స్పెషాలిటీ ఉంటుంది.

కల్పితాల కంటే వాస్తవాల ఆధారంగానే ఆయన సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతాయి.ఒకప్పుడు కామెడీ సినిమాలతో బాలీవుడ్ ను నవ్వుల్లో ముంచేసిన ఈ హీరో.

ప్రస్తుతం వరుసబెట్టి బయోపిక్ లు చేస్తున్నాడు.తనలోని సీరియస్ యాంగిల్ ను బయటపెడుతున్నాడు.

తాజాగా మరో బయోపిక్ తో ముందుకు వస్తున్నాడు ఈ హీరో.అర్థ శతాబ్దం క్రితం పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో పోరాట వీరుడి రూపంలో కనిపించబోతున్నాడు.

నిజానికి అక్షయ్ ఇప్పటి వరకు ఏయే బయోపిక్ చిత్రాల్లో నటించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ లో మంచి నేమ్, ఫేమ్ ఉన్న నటుడు అక్షయ్ కుమార్.ఆయన ఏ సినిమా చేసినా.

బాక్సాఫీస్ దగ్గర పైసలు వర్షం కురవాల్సిందే.ప్రస్తుతం బయోపిక్స్ తో అదరగొడుతున్నాడు.

వరుసబెట్టి బయోపిక్స్ తీస్తున్నాడు.తాజాగా మరో బయోపిక్ తో ముందుకు వస్తున్నాడు.

1971 ఇండో-పాక్ యుధ్దం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో వీరపోరాట యోధుడు మేజర్ ఇయాన్ కార్డోజో జీవిత చరిత్రను ఆవిష్కరిస్తున్నాడు.

ఈ చిత్రానికి గోర్ఖా అనే పేరు పెట్టారు.ఇప్పటికే అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో బయోపిక్స్ బాద్ షా అనే పేరుంది.

అంతేకాదు.ఇప్పటి వరకు ఆయన చేసిన బయోపిక్స్ అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

"""/"/ ఎయిర్ లిఫ్ట్ సినిమాలో రంజిత్ కతియాల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

నానావతి లైఫ్ స్టోరీ ఆధారంగా రుస్తుమ్ తీసి మరో హిట్ కొట్టాడు.శానిటరీ ప్యాడ్స్ తయారు చేసిన అరుణాచలం మురుగన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ప్యాడ్ మ్యాన్ సినిమా చేశాడు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. """/"/ అటు ఇండియాకు హాకీలో బంగారు పతకం తెచ్చిన లెజండరీ ఇండియన్ హాకీ ప్లేయర్ కిషన్ లాల్ జీవిత చరిత్ర ఆధారంగా గోల్డ్ సినిమా చేశాడు.

సిక్కుపోరాట యోధుడు హవీల్దార్ ఇషార్ సింగ్ క్యారెక్టర్ తో కేసరి సినిమా చేసి మళ్లీ సక్సెస్ అయ్యాడు.

అటు మహారాజ్ పృధ్విరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా పృధ్విరాజ్ మూవీ చేస్తున్నాడు అక్షయ్.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??