నా సినిమా ఫ్లాప్ అయితే నన్నే నిందించండి... స్టార్ హీరో కామెంట్స్ వైరల్?
TeluguStop.com
ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు ఈ ఏడాది సినిమాల పరంగా పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ అభిమానులను తీవ్రంగా గురి చేస్తున్నాయి.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
ఈయన నటించిన వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్, కొద్ది రోజుల క్రితం విడుదలైన రక్షాబంధన్ సినిమా కూడా అభిమానులను ఎంతో నిరాశకు గురిచేసింది.
ఇకపోతే తాజాగా అక్షయ్ కుమార్ నటించిన కట్పత్లీ సెప్టెంబర్ రెండవ తేదీ విడుదల కావడంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.ప్రేక్షకులకు సినిమాల పరంగా ఏం నచ్చుతుందో,వారే కావాలనుకుంటున్నారు తెలుసుకొని తదుపరి సినిమాలను అలాగే చేస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
"""/"/
ఇక తాను నటించిన గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం పై కూడా ఈయన స్పందిస్తూ తన నటించిన సినిమాలు అపజయం అయితే అభిమానులు పూర్తిగా తనని మాత్రమే నిందించాలని పేర్కొన్నారు.
ఇక ఈయన నటించిన కట్పత్లీ సినిమా తమిళ రాక్షసన్ సినిమాకు రీమేక్ చిత్రం ఇందులో అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీతిసింగ్ నటించిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
మరి ఈ సినిమాతో అయినా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.
ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?