Akshay Kumar : షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకు పెద్దపెద్ద గాయాలు.. ఎవరికంటే?
TeluguStop.com
సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరో హీరోయిన్ లకు నటీనటులకు గాయాలవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో ఇలా షూటింగ్ లు జరుగుతున్న సమయంలో హీరో హీరోయిన్లు గాయపడిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
మొన్నటికి మొన్న లవ్ టు డే సినిమా( Love To Day Movie ) హీరోయిన్ కి ప్రమాదం జరిగి ముఖానికి గాయాలు అయిన విషయం తెలిసిందే.
అలాగే హీరోయిన్ సమంతకు, హీరో విశాల్ కు కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయాలు అయ్యాయి.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూడా షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో షూటింగ్లో గాయపడినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు అక్షయ్ కుమార్( Akshay Kumar ).
బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్కు గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అక్షయ్ బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతోంది.ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో అక్షయ్ కుమార్ గాయపడినట్లు తెలుస్తోంది.
"""/" /
ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్( Action Sequence ) సీన్లు చేస్తున్న సమయంలో అక్షయ్ గాయపడినట్లు తెలుస్తోంది.
ఓ ఫైట్ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం.కాగా హీరో అక్షయ్ గాయపడినప్పటికీ షూటింగ్ ని అలాగే కొనసాగించారని చిత్రబృందం వెల్లడించారు.
అయితే అందుకు సంబంధించిన ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన మీనాక్షి సిన్హా( Meenakshi Sinha ) నటిస్తుండగా పృథ్వీరాజ్( Prithviraj ) సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ ఇంకా నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
బీజింగ్ మెట్రోలో షాకింగ్ ఘటన.. సీట్ ఇవ్వలేదని యువతిని కొట్టిన వృద్ధుడు..