ఆరు రోజుల్లోనే శతక్కొట్టేసిన హీరో

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోల్లో భీబత్సమైన ఫాంలో ఉన్న హీరో ఎవరు అంటే ఠక్కున వచ్చే పేరు అక్షయ్ కుమార్.

ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘గుడ్ న్యూస్’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే సినిమా వంద కోట్లను కొల్లగొట్టింది.ఇంత తక్కువ సమయంలో వంద కోట్లు కొల్లగట్టడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు చిత్ర యూనిట్.

సినిమా రిలీజ్ రోజుకంటే కూడా న్యూ ఇయర్ రోజున(బుధవారం) ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

తనదైనా కామెడీతో సినిమాలను సక్సెస్ చేయడంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

గుడ్ న్యూస్ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జీత్ ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు.

మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.